వరంగల్లో మరో విద్యార్థి సూసైడ్.. ఎందుకో తెలుసా?

praveen
వరంగల్ కు చెందిన మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైఫ్ అనే యువకుడు వేధించిన నేపథ్యంలో చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే వెంటనే ఆసుపత్రికి తరలించగా చివరికి మృత్యువుతో పోరాడి ఓడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్రాన్ని మొత్తం ఊపేసింది. అయితే ఇక ప్రీతి ఘటన గురించి మరవకముందే ఇక మరో విద్యార్థి రక్షిత సైతం ఇక ఇలాగే ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని షాక్ గురి చేసింది అన్న విషయం తెలిసిందే.

 ఇలా వరుసగా ఎంతో మంది విద్యార్థులు వేధింపులకు గురవుతూ మనస్థాపంతో  ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతుంది అని చెప్పాలి. యువకుడు మోసం చేశాడు అన్న కారణంతో ఉషారాణి అనే విద్యార్థి చివరికి బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు అరణ్య రోదనను మిగిల్చింది అని చెప్పాలి.

 ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ కు చెందిన ఉషారాణి ఒక యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు మాత్రం ఇక అన్ని విధాలుగా అవసరాలు తీర్చుకొని చివరికి ముఖం చాటేసాడు. దీంతో ఇక యువకుడి చేతిలో మోసపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినా ఉషారాణి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఉషారాణి హుజురాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఒకేషనల్ కోర్స్ చదువుతూ ఉంది అని చెప్పాలి. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మాత్రం సంచలనంగా మారిపోతు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: