భోజనం చేసి కళ్యాణ మండపంలోకి రాగానే.. అందరికీ ఊహించని షాక్?

praveen
సాధారణంగా పెళ్లి అన్న తర్వాత తెలిసి తెలియని బంధు మిత్రులందరు కూడా హాజరవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పెళ్లి వేదిక వేదిక మొత్తం ఇలా బంధుమిత్రులు స్నేహితులతో నిండి పోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా పెళ్లికి వచ్చినవారు అక్కడ వండిన రుచికరమైన భోజనాలను రుచి చూడకుండా అస్సలు వెళ్ళరు. ఎన్ని పనులున్న పక్కన పెట్టేసి ఇక కడుపు నింపుకున్న తర్వాతనే ఇక అక్కడి నుంచి బయలుదేరడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ పెళ్లి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఇలాంటిదే చేశారు.

 ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి తంతు పూర్తయింది. ఈ క్రమంలోనే నూతన వధూవరులను ఆశీర్వదించిన బంధుమిత్రులు ఆ తర్వాత భోజనాల వైపు వెళ్లారు. ఈ క్రమంలోనే తమకు ఇష్టమైన ఆహారం తిన్నారు. ఇక ఆ తర్వాత హాయిగా కడుపు నింపుకొని మళ్ళీ పెళ్లి మండపంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఎందుకంటే ఇలా పెళ్లికి వచ్చిన 43 మంది కడుపునొప్పి వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. దీంతో పెళ్లి మండపంలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కాలేదు.

 ఇక ఇలా అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి. మధ్యప్రదేశ్ లోని కార్గోన్ నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో రాత్రి సమయంలో ఒక వివాహ వేడుక జరిగింది. అయితే ఇక వివాహ వేడుకకు ఎంతో మంది బంధుమిత్రులు హాజరయ్యారు. అయితే భోజనం చేసిన తర్వాత 43 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు.  భోజన సమయంలో వాళ్లంతా పాలు సీతాఫలంతో కలిపి చేసిన కస్టర్డ్ తిన్నారు. దీంతో ఇలా భోజనం చేసి మళ్లీ పెళ్లి మండపంలోకి వచ్చిన కాసేపటికి వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వారు చికిత్స తీసుకొని కోరుకుంటున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: