ఎయిర్పోర్టులో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏంటా అని చెక్ చేస్తే?

praveen
సాధారణంగా ఒకప్పుడు సినిమాల్లో చూపించిన ఘటనలు నిజజీవితంలో జరగడం మాత్రం అసాధ్యం అనేవారు ఎంతోమంది ప్రేక్షకులు. కానీ నేటి రోజుల్లో నిజజీవితంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇలాంటి ఘటనలు సినిమాల్లో కూడా ఉండవేమో అని ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. సినిమాలలో చూపించినట్లుగా కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు జనాలు. అయితే ఈ క్రియేటివిటీ మంచి పనులు చేయడం కోసం కాకుండా ఏదో ఒకటి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో దేశ విదేశాల నుంచి భారత్ కి ఏదో ఒకటి అక్రమ రవాణా చేస్తూ ఏర్పోర్ట్ లో దొరికిపోవడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 ముఖ్యంగా ఇటీవల కాలంలో విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎంతో మంది పట్టుబడిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా బంగారం అక్రమ రవాణా చేయడానికి కొంతమంది చిత్ర విచిత్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. సినిమాల్లో చూపించిన క్రియేటివిటీకి మించి మరింత క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఏకంగా అధికారులకే షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. అయినప్పటికీ చివరికి అధికారులు చాకచక్యంగా  వ్యవహరించి అక్రమార్కుల ఆటలకు అడ్డుకట్ట వేస్తున్నారు. కేరళలో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఒక వ్యక్తి ఎంచుకున్న మార్గం ఏకంగా అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది.

 కేరళలోని ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ కి చెందిన కస్టమ్స్ డిపార్ట్మెంట్.. ఇక భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఏకంగా 1259 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసింది. ఈ బంగారం విలువ 53 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే దుబాయ్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఒక ప్రయాణికుడు కాస్త విచిత్రంగా ప్రవర్తించడంతో ఇక అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతని చెక్ చేయక అతని దగ్గర 53 లక్షల రూపాయల బంగారంని గుర్తించారు అని చెప్పాలి. అయితే ఈ బంగారాన్ని మొత్తం క్యాప్సిల్స్ రూపంలో మింగి కడుపులో దాచుకున్నాడు సదరు అక్రమార్కుడు. దీంతో అతను బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఎంచుకున్న మార్గంతో అధికారులు సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: