వరుడు తమ్ముడి ఫోన్ కి.. వధువు వాయిస్ మెసేజ్.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్?

praveen
సాదరణంగా పెళ్లి అంటే.. ఇంట్లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలిసి తెలియని బంధుమిత్రులందరూ కూడా వధూవరులు ఇంటికి చేరుకుంటారు. దీంతో ఇక బంధువులతో నిండిపోయిన ఇంట్లో ఎంతో హడావిడి ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి హడావిడిగా ఉంది. పెళ్లికి  అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వరుడు తరుపు బంధువులు. ఇలాంటి సమయంలోనే ఇక వధువు కాబోయే భర్త తమ్ముడి వాట్సాప్ కి ఒక వాయిస్ మెసేజ్ పంపింది.

 ఇలాంటి సమయంలో వదిన నాకు వాయిస్ మెసేజ్ పంపింది. ఏమైవుంటుందా అని అది ఓపెన్ చేశాడు సదరు యువకుడు. కానీ అది విన్న తర్వాత మాత్రం అతని మైండ్ బ్లాక్ అయింది అని చెప్పాలి. ఇంకేముంది పరిగెత్తుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యుల ముందు ఆ వాయిస్ మెసేజ్ ను వినిపించాడు. ఇంతకీ అందులో ఏముందో తెలుసా.. నేను పెళ్లికి పనికిరాను అంటూ సదరు యువతి వాయిస్ మెసేజ్ పంపించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. గయా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతికి పెళ్లి సంబంధం కుదిరింది.. అబ్బాయి ఇంట్లో పెళ్లి పనులు హడావిడి మొదలైంది.

 ఇంతలో ఇక వరుడి తమ్ముడికి వధువు నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. నేను పెళ్లికి పనికిరాను నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నా శరీరంలో చాలా భాగాలు దెబ్బతున్నాయి. నన్ను పెళ్లి చేసుకున్న నావల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక భార్యగా నేను అతని సుఖ పెట్టలేను. ఇంత చెప్పినా మీరు పెళ్లికి ఒప్పుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ సదరు వాయిస్ మెసేజ్ లో ఉండడం గమనార్హం. ఇంకేముంది మగ పెళ్లింటి వారు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక ఏదో పని మీద బయటకు వెళ్లి వచ్చిన వధువు తండ్రి ఇంట్లో చూసినా కూతురు కనిపించలేదు. మొబైల్లో వాయిస్ మెసేజ్ చూసాడు. ఆ తర్వాత ఆమె ఒక పోలీస్ తో ప్రేమలో ఉందని.. అతను రాజస్థాన్లో ఉన్నాడని.. తెలిసి తన కూతురు కూడా రాజస్థాన్ వెళ్తుందని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు రంగంలోకి దిగి  అనుమానించినట్లుగానే రాజస్థాన్లో ఈ జంటను పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: