ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని.. కోర్టులో కేసు వేశాడు?

praveen
సాధారణంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు పుట్టడం అనేది సహజం. ఇక ఇటీవల కాలంలో ఏకంగా స్కూల్ వయసు నుంచి ఎంతోమంది విద్యార్థులు ప్రేమ పేరుతో చెడు దోవలో నడుస్తూ ఉండడం కూడా కనిపిస్తోంది. కేవలం ఒక విద్యార్థి దశలో ఉండే ఆకర్షణనే ప్రేమగా భావిస్తూ చివరికి ఎంతోమంది విద్యార్థులు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సరిగ్గా చదవక ఇక గాలి తిరుగుళ్లు తిరుగుతూ చివరికి దేనికి పనికి రాకుండా పోతూ ఉన్నారు. అదే సమయంలో ప్రేమను అంగీకరించలేదు అన్న కారణంతో ఏకంగా ప్రేమించిన వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి.

 అయితే ఇప్పుడు వరకు ఏకంగా తమ ప్రేమను అంగీకరించలేదు అన్న కారణంతో ప్రియురాలిపై దారుణంగా యాసిడ్ దాడికి పాల్పడటం లేదంటే ఇక విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి హత్యలు చేయడం లాంటి ఘటనలు ఎంతోమందిని భయాందోళనకు గురిచేసాయ్. ఇక మరి కొంతమంది మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చూశాము. అయితే ఒక వ్యక్తి తమ ప్రేమను వ్యక్తపరిచిన తర్వాత ఆ ప్రేమను ఒప్పుకోవాలా లేదా అనేది ఎదుటి వ్యక్తి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తి ప్రేమను నిరాకరిస్తే మాత్రం జీర్ణించుకోలేక ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు.

 అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా కని విని ఎరుగనిది అని చెప్పాలి. ఏకంగా తాను ప్రేమించిన అమ్మాయి తాను ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదు అన్న కారణంతో కోర్టులో కేసు వేశాడు ఇక్కడ ఒక యువకుడు. ఏకంగా 24 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ పిటీషన్ వేయడం సంచలనంగా మారిపోయింది. సింగపూర్ కు చెందిన కౌశికన్ తనకు పరిచయమైన నోరాటాన్ అనే అమ్మాయిని ప్రేమించాడు. అయితే తన ప్రేమను ఆమె మాత్రం నిరాకరించింది. దీంతో కౌశిగన్ ఆమె వల్ల పరువు నష్టం జరిగిందని మనసుకు.. గాయంతో పాటు జీవితంలో నిరాశ మిగిలింది అంటూ తెలిపాడు. ఈ క్రమంలోనే నష్టపరిహారంగా.. 24 కోట్లు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: