గన్ గురిపెట్టిన భయపడలేదు.. దొంగలను తరిమికొట్టిన ఇద్దరు మహిళలు?

praveen
ఆడది అబల మాత్రమే.. ఎవరైనా దాడి చేస్తే కేవలం గాయాల పాలు కావడం తప్ప తిరిగి ధైర్యంగా ఎదిరించే సత్తా ఆడవారిలో ఉండదు అనే భావనతోనే ఇప్పటికీ ఎంతో మంది మహిళలు భయం కానీ సభ్య సమాజంలో బ్రతుకుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆడది అబలకాదు సభల అని నిరూపించ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మహిళ ధైర్యంగా ఎదురుతిరిగి నిలబడింది అంటే చాలు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలదు అన్న విషయాన్ని నిరూపించేలా ఇక్కడ ఒక ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి.

 ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులు అసమాన్యమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు అని చెప్పాలి. ఇటీవల కాలంలో బ్యాంకు దోపిడీలకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.  ఇళ్లకు చోరీ వేస్తే ఏం వస్తుంది అనుకుంటున్నారో ఏమో.. ఏకంగా దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం బ్యాంకు లూటిలు చేయడానికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే అడ్డుకున్న వారిని చంపేసేందుకు మారణాయుధాలు వెంట తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇక్కడ ఇలాంటిదే జరిగింది. బీహార్ లోని హాజీపూర్ లో గ్రామీణ బ్యాంకు కస్టమర్లతో  బిజీ బిజీగా ఉంది.

 అదే బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు జూహి కుమారి, శాంతి కుమారి అనే ఇద్దరు కానిస్టేబుల్లు. అయితే ఇక ఇటీవలే వారు విధుల్లో ఉన్న సమయంలో బ్యాంక్ లూటీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు లోనికి ప్రవేశించారు. ఇక బ్యాంకులోకి వచ్చిన కొంత సమయంలోనే తమ దగ్గర ఉన్న తుపాకులను బయటకు తీసి ఇక సెక్యూరిటీ గార్డులకు గురిపెట్టారు. ఇక ఆ స్థానంలో ఎవరున్నా భయపడి పోతారు. కానీ ఆ మహిళా సెక్యూరిటీ గార్డులు మాత్రం ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తమ వద్ద ఉన్న గన్ లతో దొంగల వైపు ఎదురుదాడికి దిగారు. కాసేపటి వరకు దొంగలకు కానిస్టేబుల్ళకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గామారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: