వింత దొంగలు.. చోరీకి వెళ్లి ఏం చేశారంటే?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద కాస్త ఎక్కువగానే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించాయి అంటే చాలు ఇక ఏదో విధంగా లూటీకి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి తెలియకుండా ఇంట్లోకి రహస్యంగా చొరబడటం.. ఇక విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకొని అందిన కాడికి దోచుకుపోతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక బయటికి వెళ్లిన యజమానులు ఇంటికి వచ్చేసరికి ఊహించని షాక్ లు తగులుతున్నాయి.

 అంతేకాదు ఇటీవల కాలంలో దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం అటు పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చోరీలకు పాల్పడుతున్న తీరు ఖాకీలకే సవాల్ విసురుతుంది అని చెప్పాలి.. ఇక ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజుల్లో కోకోళ్ళలుగా మారిపోయాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలో అయితే ఒక విచిత్రమైన దోపిడీ దొంగలకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చోరీకి వెళ్ళిన దొంగలు వెళ్లిన పని మర్చిపోయి ఉప్మా వండుకుని తిన్నారు. ఇక ఆ తర్వాత చోరీ చేశారు. అయితే అప్పటికే గ్రామస్తులు అప్రమత్తమై వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

 ఎల్లంపేట గ్రామంలో ఉండే తాళ్లపల్లి రమేష్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. అయితే రాత్రి సమయంలో దుండగులు కిటికీలు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఎవరికి అనుమానం రాదని భావించి..  ఇంట్లోకి వెళ్లి ఉప్మా వండుకొని కడుపు నింపుకున్నారు. ఆ తర్వాత ఇంట్లోని సామాన్లని సర్దుకొని అక్కడి నుంచి పారిపోయెందుకు ప్రయత్నించారు. కానీ గ్రామస్తులు అప్పటికే అప్రమత్తమయి వారిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. ఇక ఇలా చోరికి పాల్పడిన వారు నల్గొండ జిల్లాకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: