ట్యూషన్ కోసం పిలిచి.. 16 ఏళ్ళ బాలుడుతో టీచర్ పాడుపని?

praveen
టీచర్ వృత్తి అంటే ఎంత గౌరవప్రదమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు కేవలు జన్మనిస్తే ఇక జన్మకు సార్ధకం చేసి ఒక దారిని చూపేది మాత్రం టీచర్లే అని అంటూ ఉంటారు పెద్దలు. ఇక టీచర్ల మీద నమ్మకంతోనే అభం శుభం తెలియని తమ పిల్లలను స్కూల్ కి పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే ఇలా స్కూలుకి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సి ఉంటుంది ఉపాధ్యాయులు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది టీచర్లు మాత్రం గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతూ నీచమైన పనులు చేస్తూ ఉండడం వెలుగులోకి వస్తోంది.

 టీచర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఏకంగా తమ దగ్గర చదువుకుంటున్న పిల్లలను సొంత పిల్లలుగా చూసుకోవాల్సింది పోయి ప్రేమ దోమ అంటూ ఎంతోమంది టీచర్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి.  ఇక్కడ ఒక టీచర్ ఇలాంటిదే చేసింది. ఇంటి ముందు ఉండే ఒక బాలుడుతో ప్రేమాయణానికి తెరలేపింది. ఆ బాలుడిని ఎలాగైనా దక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 నోయిడా సెక్టార్ 123 లో నివసిస్తున్న 22 ఏళ్ల టీచర్ ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉండేది. అయితే ఇంటి ముందు ఉన్న 16 ఏళ్ల బాలుడు ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇక ఇద్దరి మధ్య కొన్ని రోజుల్లోనే సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఒకరిని ఒకరు ఇష్టపడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత శారీరక సంబంధం కూడా ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఎలాగైనా 16 ఏళ్ల బాలుడిని దక్కించుకోవాలని ప్లాన్ వేసిన టీచర్ చివరికి ఓ రోజు అతని తీసుకొని ఇంటి నుంచి పారిపోయింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు ఇక టీచర్ తమ కొడుకుని తీసుకువెళ్లింది అంటూ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: