పవర్ బ్యాంకుతో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడింది.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే దేశ విదేశాల్లో ఉన్న మనిషితో నేరుగా మాట్లాడినట్లుగానే మొబైల్ ద్వారా మాట్లాడగలుగుతున్నారు మనుషులు. ఇలా మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరం చాలా తగ్గిపోయింది అని చెప్పాలి. అంతేకాదు ఇక అధునాతన టెక్నాలజీ తో కూడా మొబైల్స్ వస్తుండడంతో ఇక ఏది కావాలన్నా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే దొరికేస్తూ ఉంది.

 తద్వారా ఎవరికి కూడా బయట ప్రపంచం తో పని లేకుండా పోయింది. ఒక మొబైల్ ఉంటే చాలు ఇక అదే ప్రపంచంలో బ్రతికేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది మొబైల్ కి బానిసలుగా మారిపోయి ఏకంగా అందులోనే గంటల పాటు సమయం గడుపుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా అర చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఒక్క క్షణం పాటు మొబైల్ కనిపించకపోయినా ఇక పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉండడం కూడా నేటి రోజుల్లో కనిపిస్తూ ఉంది.

 అంతేకాదు మొబైల్ ను అతిగా వినియోగించడం కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉండడం గమనార్హం. అయితే కొంతమంది ఏకంగా మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. తద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. పవర్ బ్యాంకుకు చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్న ఒక యువతి చివరికి కరెంట్ షాక్ కొట్టి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. హాస్టల్లో ఉంటున్న యువతి రూమ్ లో కిటికీ వద్ద నిలబడి పవర్ బ్యాంకు తో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుంది. అయితే బయట ఉన్న విద్యుత్ పోల్ నుంచి పవర్ బ్యాంకుకు ఎర్తింగ్ రావడంతో షాక్ కొట్టింది. అయితే ఆమెకు కాపాడబోయిన మరో ఇద్దరు యువతలకు కూడా షాక్ తగిలింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: