పాపం డెలివరీ బాయ్.. కుక్క భయంతో 3వ ఫ్లోర్ నుంచి దూకాడు?

praveen
గ్రామ సింహం అని కుక్కను పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక మనుషులందరూ పడుకున్న సమయంలో కూడా కుక్కలు గ్రామానికి మొత్తం కాపలా కాస్తూ ఉంటాయని ఇలాంటి పేరు పెట్టారు. కానీ ఇటీవల కాలంలో కుక్కలు కాపలా కాయడం ఏమో కానీ మనుషుల పాలిట మృత శఖటంగా మారిపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో వీధి కుక్కలు రెచ్చిపోతూ అటు మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయ్. ఇక ఇలా దారుణంగా దాడు చేస్తూ ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.

 ఇటీవల కాలంలో ఇలా కుక్కల దాడిలో మనుషులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. అయితే ఇక వీధి కుక్కల నుండి ఇక అందరికి రక్షణ కల్పించేందుకు అటు అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వీధి కుక్కలు రెచ్చిపోతూ ఉన్నాయి. అయితే కేవలం వీధి కుక్కలు మాత్రమే కాదు పెంపుడు కుక్కలు సైతం ఇలా మనుషులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ అందరిని భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పాలి. హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక ఘటన కూడా తీవ్ర సంచలనం రేపుతుంది.

 అతను ఒక డెలివరీ బాయ్. ఎవరైనా కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేశారంటే ఇక వాటిని ఇంటి ముంగిటికే డెలివరీ చేస్తూ ఉంటాడు. ఇక వచ్చిన ఆదాయంతోనే జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అతని జీవితంలో కుక్క విషాదాన్ని నింపింది. ఏకంగా కుక్క కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6 లోని లుంబిని రాక్ క్యాజువల్ అపార్ట్మెంట్లో నివసించే శోభన అనే మహిళకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చాడు మహమ్మద్ రిజ్వాన్ అనే 23 ఏళ్ల డెలివరీ బాయ్. అయితే తలుపులు తీసే ఉండడంతో డెలివరీ బాయ్ మాట వినగానే ఒకసారి ఇంట్లో ఉన్న జర్మన్ షెఫర్డ్ కుక్క బయటకు దూసుకు వచ్చి  అతని కరువ బోయింది. చివరికి కుక్క వదలకపోవడంతో భయంతో మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకేసాడు. అతని తలకు తీవ్ర గాయం అయింది.. చివరికి చికిత్స కోసం నిమ్స్ కు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: