డెలివరీకి అదనంగా రూ.30 తీసుకున్నందుకు.. లక్ష జరిమానా?

praveen
ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో వంట గ్యాస్ అనేది సామాన్యుడికి భారంగా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కగలుగుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటువంటి గ్యాస్ ధర అంతకంతకు పెరిగిపోతూ ఉండడం సామాన్యుడిని అయోమయంలో పడేస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం రెగ్యులర్ యూస్ వంటకాలు ధర 1100 రూపాయలకు పైగానే పలుకుతూ ఉంది. దీంతో సామాన్యులు అందరూ కూడా ఎంతో ఆచితూచి వంట గ్యాస్ ను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికే వంట గ్యాప్ ద్వారా ఆకాశాన్ని అంటుతూ ఉండగా మరోవైపు ఇక ఇలా వంటగ్యాస్ డెలివరీ చేసేందుకు ఏజెన్సీ నుంచి వస్తున్న సిబ్బంది అదనంగా దాదాపు 20 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలా ఎవరైనా వసూలు చేశారంటే వెంటనే ఫిర్యాదు చేయాలని ఇప్పటికే వినియోగదారుల ఫోరం అందరికీ సూచించింది.

 ఇక ఇలాంటి ఫిర్యాదులు చేసి ఎందుకు తలనొప్పి తెచ్చుకోవడం అని కస్టమర్లు సైలెంట్ గా ఉంటూ ఇక చివరికి డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక వినియోగదారుడు మాత్రం అలా అనుకోలేదు. ఏకంగా గ్యాస్ సిలిండర్ డెలివరీకి అదనంగా 30 రూపాయలు వసూలు చేసినందుకుగాను వినియోగదారుల ఫోరంకి ఫిర్యాదు చేశాడు. 2019లో అనంతపురం కు చెందిన లక్ష్మీప్రసాద్ సిలిండర్ బుక్ చేయగా 30 రూపాయలు అదనంగా ఇవ్వాలని డెలివరీ బాయ్ డిమాండ్ చేశాడు. 30 రూపాయలు అదనంగా ఇవ్వను అని చెప్పినందుకు సిలిండర్ వెనక్కి తీసుకెళ్లాడు. అంతే కాదు ఏజెన్సీని మరో ప్రాంతానికి కూడా బదిలీ చేశాడు. లక్ష్మీ ప్రసాద్ వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయడంతో ఇక సదర్ ఏజెన్సీ వినియోగదారుడికి లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: