భార్యను చంపిన ఆర్మీ ఆఫీసర్.. ఎందుకో తెలుసా?

praveen
ఏంటో.. ఇటీవలే కాలంలో పెళ్లి అనే మాట వినిపిస్తే చాలు యువకులు అందరూ కూడా భయపడిపోతున్నారు అని చెప్పాలి. కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి అంటే ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటూ ఇక కలకాలం కలిసి జీవించే భార్యాభర్తలే కనిపించేవారు. కానీ నేటి రోజుల్లో పెళ్లి చేసుకుని దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన వారు ఏకంగా ఒకరిపై ఒకరు కక్షపెంచుకొని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.

 ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఓ రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య తలేత్తిన చిన్నపాటి గొడవలకే చివరికి విచక్షణ కోల్పోయి కట్టుకున్న వారిని హత మారుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా భారత సైన్యానికి చెందిన లెఫ్ట్నెంట్ కల్నల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్యను దారుణంగా మర్డర్ చేశాడు. ఈ ఘటన పంజాబ్లోని ఫెరోజ్పూర్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.. అయితే భార్యను దారుణంగా కాల్చి చంపడమే కాదు ఆ తర్వాత ఇక తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

 అయితే ఇదంతా జరగడానికి ముందు ఇలా లెఫ్టినెంట్ కల్నల్ గా  పనిచేస్తున్న సదరు వ్యక్తి ఇక సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తుంది. తన భార్యకు హాని చేసినట్లు ఇక ఆ ఆఫీసర్ తన లేఖలో చెప్పుకొచ్చాడు. తన భార్యతో గత కొన్నాళ్ల నుంచి కూడా తగాదాలు ఉన్నాయి అంటూ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా తరచూ కౌన్సిలింగ్కు వెళ్లి వస్తున్నట్లు కూడా తెలిపాడు. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన పై ఇక ఆర్మీ తో పాటు పంజాబ్ పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: