రాత్రి అందుకు ఒప్పుకోలేదని.. లవర్ ఏం చేసాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోయిందేమో అని అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులుగా మారి పోతున్న మనుషులు దారుణం గా ప్రాణాలను తీసేస్తూ ఉన్నారు. ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు అని చెప్పాలి. మరి ముఖ్యం గా ఇటీవల కాలం లో అక్రమ సంబంధాల కారణం గా పోతున్న ప్రాణాలు సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది అని చెప్పాలి.

 కొంత మంది ఏకంగా కట్టుకున్న వారు ఉన్నప్పటికీ పరాయి వ్యక్తులు మోజు లో పడిపోతూ ఉంటే.. మరికొంత  మంది ఇక కట్టుకున్న వారు చనిపోయి ఒంటరిగా జీవిస్తూ మరొకరితో అక్రమ సంబంధానికి తెరలేపుతున్నారు. వెరసి అక్రమ సంబంధాలు పెట్టుకుని సుఖం పంచిన వారు చివరికి దారుణం గా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 50 ఏళ్ళు. 8 నెలల క్రితమే భర్త చనిపోవడం తో పిల్లలతో కలిసి జీవిస్తుంది.

 కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే నారాయణ పేట జిల్లాకు చెందిన మేస్త్రి హను మంతుతో ఆమెకు పరిచయం ఏర్పడింది.  పరిచయం కాస్త కొన్ని రోజులకే వివాహేతర సంబంధం గా మారిపోయింది అని చెప్పాలి. ఇక వీరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది.  హనుమంతు సదరు మహిళ ఇంటికి వెళ్లి తనతో రాత్రి గడపాలంటూ కోరాడు. కానీ తనకు అనారోగ్యంగా ఉందని వద్దు అంటూ నిరాకరించింది సదరు మహిళ. దీంతో కోపంతో ఊగిపోయిన హనుమంతు గొంతుకు కొంగు చుట్టి దారుణంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లాలోని మొయినాబాద్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: