రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. కేవలం గంట వ్యవధిలోనే?

praveen
ఇటీవల కాలం లో నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే  నేరస్తులు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి అనే భయంతో కాస్త వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయం లో కొంత మంది చైన్ స్నాచర్లు మాత్రం మరింత బరితెగించి.. ఇక నేరలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు మాత్రం అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఒంటరిగా మహిళలు కనిపించారంటే చాలు చైన్ స్నాచింగ్ కు  పాల్పడుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలం లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో చైన్స్ స్నాచర్లు  హడలెత్తిస్తున్నారు అని చెప్పాలి.

 రోజుకో ప్రదేశం మారుస్తూ ఏకంగా మహిళలను టార్గెట్ చేసుకుంటూ చైన్స్ స్నాచింగ్ కు  పాల్పడుతూ ఉన్నారు. ఇక ఈ కేసులను చేదించడం నాకు పోలీసులకే సవాల్ గా మారి పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా గంటల వ్యవధిలోని ఎక్కువ చైన్స్ మ్యాచింగ్ కేసులు నమోదవ్వటంతో అందరు భయపడిపోతున్నారు. ముఖ్యంగా నార్సింగిలో ఇలాంటి కేసులు ఎక్కువ అవ్వడంతో బయటికి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు.

 ఇకపోతే ఇటీవల హైదరాబాద్ నగరంలో చైన్స్ స్నాచర్లు మరింత రెచ్చిపోయారు అన్నది తెలుస్తుంది. కేవలం గంట వ్యవధిలోని ఉప్పల్, నాచారం, ఓయూ, రామ్ గోపాల్ పేట లలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. దీంతో ఇలా గంట వ్యవధిలోనే 6 కేసులు కూడా ఆయా పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి అని చెప్పాలి.చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఇలా  కనురెప్ప కాలంలో దొంగతనాలకు పాల్పడుతున్న తీరు మొత్తం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు అని చెప్పారు. నేరస్తులను గుర్తించే పనిలో మునిగిపోయారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: