ఆపరేషన్ థియేటర్లో వేధింపులు.. శస్త్రచికిత్స చేసాక అక్కడ చేతులు పెట్టి?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మహిళలకు లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు అన్న విషయం తెలిసిందే. వెరసి ప్రతి మహిళా కూడా అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే కామాంధుల కోరల్లోంచి తప్పించుకునేందుకు ఎంతలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక అడుగడుగునా మంచి వాళ్ళ ముసుగులో ఉన్న కామందులు కనిపిస్తున్న నేపథ్యంలో మహిళల జీవితం రోజురోజుకు దుర్భరంగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే సాధారణంగా ఇలా ఇల్లు దాటి బయటకు వెళ్ళినప్పుడు ఆకతాయిలు మహిళలను వేధించడం లాంటివి ఇప్పటివరకు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి.

 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం మరింత అమానవీయమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేక ఆసుపత్రిలో చేరితే.. ఇక వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స కూడా చేశారు. కానీ ఆమె ఇక మత్తులో ఉన్న సమయంలో ఏకంగా శాస్త్ర చికిత్స చేసిన వారిలో ఒకరు ఆమెపై లైంగిక దారికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల మహిళ పిత్తాశయ సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స కోసం కోల్కతాలోని ప్రసిద్ధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది.

 కాగా వైద్యులు ఆమెకు శాస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే శస్త్ర చికిత్స చేసే సమయంలో పేషంట్ కి మత్తు ఇస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇలా శస్త్ర చికిత్స జరిగిన సమయంలో సదురు మహిళా పేషెంట్ మత్తులో ఉండగా ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె ఛాతి ప్రైవేట్ భాగాలను చేతితో తడమడంతో పాటు గట్టిగా నొక్కాడు. ఇక మత్తులో ఉన్న మహిళా అతని చర్యలను అడ్డుకోలేకపోయింది. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్లో మహిళా సిబ్బంది ఎవరు లేకపోవడం గమనార్హం. మత్తు నుంచి తేరుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: