10 వేల కోట్లు కావాలి.. ప్రభుత్వంపై నష్టపరిహారం డిమాండ్?

praveen
సాధారణంగా ఇక ఎవరైనా నేరాలకు పాల్పడ్డారు అంటే చాలు వారికి కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఎంతోమంది నేరస్తులు చిన్నచిన్న నేరాలకు పాల్పడిన వారు కూడా చివరికి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే చిన్న చిన్న నేరాలకు పాల్పడినప్పుడే ఇక జైలు శిక్ష అనుభవిస్తే ఇక ఏకంగా గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న నేరస్తుడు ఇక ఎన్నో ఏళ్ల  శిక్ష అనుభవించాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  ఇక ఇటీవల కాలంలో ఇలా ఏకంగా అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న వారికి కోర్టులు కఠిన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. అయితే ఇక ఇలా జైలులో శిక్ష అనుభవించిన వారు బయటకు వచ్చిన తర్వాత తమ తీరు మార్చుకొని ఇక ఏదో ఒక పని చేసుకుని గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎంతోమంది నేరస్తులు కొత్త జీవితాన్ని ప్రారంభించడం గురించి విన్నాం. అయితే ఇక్కడ ఒక నేరస్తుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏకంగా ప్రభుత్వం  మీదే దావా వేస్తూ కేసు నమోదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రత్నంలో వెలుగులోకి వచ్చింది.

 కాంతిలాల్ అనే వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు. అయితే ఇటీవల విశారణ జరుగుతున్న నేపథ్యంలో అతనికి గ్యాంగ్ రేప్ కు ఎలాంటి సంబంధం లేదు అన్న విషయం తెలిసింది. దీంతో నిర్దోషిగా చివరికి జైలు నుంచి బయటపడ్డాడు అని చెప్పాలి. బయటికి వచ్చిన సదరు వ్యక్తి ప్రభుత్వాన్ని నష్టపరిహారం కోరాడు. అది కూడా ఏకంగా 10 వేల కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడు. నేను శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నా ఆరోగ్యం క్షీనించింది. నా కుటుంబం రోడ్డున పడింది.. నా శారీరక సుఖాలను కూడా కోల్పోయాను అందుకే ప్రభుత్వం నాకు పదివేల కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు సదరు వ్యక్తి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: