ఇంటి ముందు మూత్రం పోయొద్దన్నందుకు.. అతనేం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మనుషులు చిన్న చిన్న విషయాలకు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు అన్న విషయం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అర్థమవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు ఉన్మాదులుగా  మారిపోతున్న మనుషులు సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. తప్పు తమ వైపే ఉన్నప్పటికీ కూడా దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ ఇక ఇతరులపై దాడికి పాల్పడటం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా భయాందోళనకు కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇటీవల కాలంలో ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇక రోడ్డు పక్కనే ఎక్కడబడితే అక్కడ మూత్ర విసర్జన చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక ఇలాంటి విషయాలపై ఎన్నోసార్లు గొడవలు జరగడం.. ఇక ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇంటి గోడపై మూత్ర విసర్జన  చేయొద్దు అంటూ కుటుంబ సభ్యులు హెచ్చరించినందుకుగాను.. ఒక వ్యక్తి రెచ్చిపోయాడు. ఏకంగా మధ్యమధ్యలో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 మధ్యప్రదేశ్ లోని బిందు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. నయాగౌడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ గ్రామంలో పింటూ శర్మ తన ఇంటి ముందు నిత్యం మూత్ర విసర్జన చేస్తూ ఉండేవాడు. ఇంటి యజమాని వికాస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం  జరిగింది. ఈ క్రమంలోనే పింటూ శర్మ పై వికాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనపై కేసు పెట్టినందుకు గాను తన అనుచరులతో కలిసి వికాస్ ఇంటికి వెళ్ళిన పింటూ మద్యం మత్తులో తుపాకీతో కాల్పులకు  తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: