దారుణం : ఆపరేషన్ చేసి.. కడుపులో టవల్ వదిలేసారు.. చివరికి?

praveen
కరోనా వైరస్ సమయంలో వైద్యులు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఏకంగా మనుషులు సాటి మనుషుల విషయంలో కాస్తయిన జాలి దయ చూపించకుండా ఏకంగా స్వార్థంగా ఆలోచిస్తున్న రోజుల్లో ఏకంగా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వందల మంది ప్రాణాలను కాపాడారు వైద్యులు. దీంతో నిజంగానే కలియుగంలో ప్రాణాలకు రక్షణ కల్పించేది తెల్లకోటు వేసుకున్న వైద్యులే అని ఎంతోమంది ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారికి అమితమైన గౌరవం అందిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇలా కరోనా వైరస్ సమయంలో వైద్యుల విలువ ఏంటి అన్న విషయం అటు ప్రతి ఒక్కరికి అర్థమైంది. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు మాత్రం ఏకంగా వైద్యవృత్తికే కలంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏకంగా తమ ప్రాణాలకు వైద్యులు వారి ప్రాణాలు పణంగా పెడతారని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలకు హాని కలిగించరని నమ్మకంతో ప్రజలు ఆసుపత్రులకు వెళుతూ ఉంటే.. కొంతమంది వైద్యులు మాత్రం   నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఏకంగా గర్భిణీ ఆసుపత్రికి వెళ్లగా.. ఆపరేషన్ చేసిన డాక్టర్ బిడ్డను బయటకు తీసి కడుపు లో టవల్ అలాగే వదిలేశాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన నజ్రానా పురిటి నొప్పులతో ప్రైవేట్ ఆస్పత్రి లో చేరింది. అయితే డాక్టర్,సిబ్బంది ఆమెకు డెలివరీ చేసి కడుపులో టవల్ మర్చిపోయి కుట్లు వేసేశారు. కడుపునొప్పి ఎక్కువగా ఉందని నజ్రాన చెప్పగా చలి ఎక్కువగా ఉండడంతో అలా జరిగిందని డాక్టర్ చెప్పుకొచ్చాడు. మరో ఆసుపత్రికి తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ నిర్వహించి ఇక సదరు మహిళ కడుపులో ఉన్న టవల్ ను బయటకు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: