పోలీస్ ఇంట్లో చోరీ.. దొంగలను పట్టుకునేందుకు ఏం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద అంతకంతకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గు ముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడ దొంగతనం చేయాలి అన్న విషయంపై ముందుగా పక్కా ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా దొంగతనాలు చేస్తూ అందిన కాడికి దోచుకుపోతున్నారు. మరి కొంతమంది ఇంట్లో పని వాళ్ళలా చేరి నమ్మకంగా పనిచేసి ఇక విలువైన వస్తువులు ఎక్కడున్నాయో తెలుసుకుని ఆ తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా చోరీ చేయాలనుకున్న దొంగలు ఎవరైనా సరే సాధారణ ప్రజల ఇళ్లల్లో చోరీ చేయడానికి ధైర్యం చేస్తారు. కానీ అదే పోలీస్ ఆఫీసర్ ఇల్లు అయితే అటువైపు చూడటానికి కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం పోలీస్ ఆఫీసర్ ఇంటిలోకే చొరబడి 40 తులాల బంగారం మూడు లక్షల రూపాయల నగదు అపహరించాడు. అయితే ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన సదరు అధికారి ఇక దొంగలను పట్టుకోవడానికి చేసిన పని మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది.

 చాందిని భాగ్ పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఏఎస్ఐ కృష్ణకుమార్ ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగ 40 తులాల బంగారం మూడు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. చోరీకి  సంబంధించి తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు సదరు పోలీస్ అధికారి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే ఇక దొంగల ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని భావించి పాండోకర్ బాబా ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ బాబా కాళ్ళ దగ్గర కూర్చుని ఇక జరిగిన విషయాన్ని ఆయనకు వివరించి దొంగలను పట్టుకోవడంలో సహాయం చేయాలని కోరాడు. ఇలా ఏకంగా సొంతింటి దొంగలను పట్టుకోలేకపోయిన పోలీస్ ప్రజలను ఏం కాపాడుతారు అంటూ స్థానికులందరూ ప్రశ్నిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: