చిల్లర దొంగతనం.. వామ్మో వాటిని కూడా వదల్లేదుగా?

praveen
ఇటీవల కాలంలో దొంగల బెడద  ఎక్కడ చూసినా ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఉద్యోగం వ్యాపారం చేసుకుని సభ్య సమాజంలో గౌరవంగా బతకడం కంటే ఇక బ్యాంకులు ఇళ్లకు కన్నాలు వేసి అన్ని కాడికి దూసుకుపోవడం ఇలా చోరీ చేసిన డబ్బుతో జల్సాలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దీంతో ఇక అటు ఇంటి యజమానులు ఎంతల జాగ్రత్త పడుతూ ఉన్నప్పటికీ దొంగల బెడద నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఇలా ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు, బంగారు నగలు, భారీ మొత్తంలో నగదు దోచుకు వెళ్లడం లాంటి కరుడ గట్టిన దొంగల గురించి ఎన్నోసార్లు విన్నాము.

 కానీ కొంతమంది మాత్రం చిల్లర దొంగతనాలు చేసి అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారూ అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ ఉంటారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో కూడా ఇలాంటి తరహా జరిగింది. సాధారణంగా దొంగతనం చేయాలి అనుకునే వ్యక్తులు కాస్త రిస్క్ అయిన పర్వాలేదు విలువైన వస్తువులను ఎత్తుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా చీప్ గా పూల మొక్కలను దొంగలించారు ఇద్దరు దంపతులు.  ఇక ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. స్కూటీ పై వచ్చిన దంపతులు ఓ స్కానింగ్ సెంటర్ ప్రాంగణంలో గులాబీ మొక్కలను దొంగలించారు.

 సాధారణంగా చోరీ చేయడానికి వచ్చిన దొంగలు ముందు వెనక అన్ని గమనిస్తూ ఎంతో అప్రమత్తంగా ఉంటారు.  కానీ ఇక్కడ పూల మొక్కలు దొంగతనం చేయడానికి వచ్చిన దంపతులు మాత్రం అక్కడ సీసీ కెమెరా ఉంది అన్న విషయాన్ని గ్రహించలేదు. దీంతో వారి చిల్లర దొంగతనానికి సంబంధించిన ఫోటో సీసీ కెమెరాలో రికార్డు అయింది   పట్టణంలోని కాటూరు రోడ్డులో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ బయట చోరీ జరిగింది అని చెప్పాలి. ఇక ఇది చూసి మరీ పూల కుండీలు దొంగతనం చేయడం ఏంటి.. దారుణం కాకపోతే అంటూ ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: