నిద్రలో అలాంటి కలలు వస్తున్నాయని.. యువకుడు సూసైడ్?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఆధునిక సమాజంలో బ్రతుకుతున్న వారు ఏ విషయంలో కూడా గొప్పగా ఆలోచించలేకపోతున్నారు అన్నది మాత్రం అర్థం అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది విలువైన ప్రాణాలను చేజేతులారా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలా ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలు తెలిసి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని కొంతమంది లేదా స్నేహితులతో గొడవ జరిగిందని మరి కొంతమంది... ఇక తల్లిదండ్రులు టీవీ చూడొద్దన్నారని, ఫోన్ వాడొద్దన్నారని మనస్తాపంతో ఇంకొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు.

 వెరసి ఇలా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య వెనుకున్న కారణం మాత్రం ప్రతి ఒకరిని కూడా అవాక్కయ్యేలా చేస్తుంది . సాధారణంగా ప్రతి మనిషికి కూడా నిద్రలో కలలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆనందాన్ని ఇచ్చే కలలు వస్తే.. మరికొన్నిసార్లు మాత్రం పీడ కలలు  వచ్చి కాస్త భయాన్ని కలగజేస్తూ ఉంటాయి. నిద్రలో ఎన్ని కలలు వచ్చినా ఇక నిద్రలేచిన  తర్వాత మాత్రం వాటిని పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.

 ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం కలలు వస్తున్నాయి ఆత్మహత్య చేసుకున్నాడు.  హిమాచల్ ప్రదేశ్ బంజర్  ఏరియాలో ఉండే 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే వారం రోజులుగా నిద్రలో పీడకలు రావడంతో సడన్గా లేచి కూర్చునేవాడు.  దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అయితే నిద్రలేమి పీడ కలలు వస్తూ ఉండడం కారణంగానే తాను చనిపోతున్నాను అంటూ లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: