అయ్యప్ప మాలతో స్కూల్ కు వెళ్ళిన విద్యార్థి.. అతన్ని చితకబాదిన సీనియర్లు?

praveen
భారత్ సకల మతాల సమ్మేళనం అని చెబుతూ ఉంటారు. ఇక అన్ని మతాలవారు కూడా భారత్లో అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఒకప్పుడు అయితే ఇలా కులాల కోసం మతాల కోసం పోట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఎంతో సామరస్యంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇంకా నేటి ఆధునిక సమాజంలో కూడా కుల మతాల పేరుతో దూషణలు దాడులు జరుగుతున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది.

 ప్రస్తుత కాలంలో ఎంతోమంది అయ్యప్ప మాల ధారణ వేసి ఇక నిష్టగా పూజలు చేస్తూ ఉన్నారు. మాలద వేసిన సమయంలో ఎప్పటి లాగానే తమ పనులను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది విద్యార్థులు సైతం ఇలా మాల ధారణలో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మాల వేసుకుని స్కూలుకు వెళ్లిన ఎనిమిదవ తరగతి విద్యార్థికి ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా నువ్వు మాల వేసుకుని స్కూలుకు వస్తావా అంటూ సీనియర్ విద్యార్థులు మాల వేసుకున్న విద్యార్థిని ధారణంగా చేతికబాదారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు సిటీలో క్రిస్టియన్స్ ట్రస్టుకు చెందిన స్కూల్లో జరిగింది.

 ఇక ఈ స్కూల్లో క్రైస్తవులతో పాటు హిందువులు ముస్లిం అబ్బాయిలు అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎనిమిదవ తరగతి చదువుతున్న అబ్బాయి ఇటీవలే అయ్యప్ప మాలవేసి దీక్ష చేపట్టాడు. కొన్ని రోజుల నుంచి ఆ అబ్బాయి పాల వేసుకుని స్కూల్లోనే స్కూలుకు వెళ్తున్నాడు. మాలవేసి ఇక స్కూల్ ఆవరణలోకి వచ్చిన ఆ విద్యార్థిని కొంతమంది ముస్లిం మతానికి చెందిన అబ్బాయిలు అడ్డగించారు. మాల వేసుకుని ఎలా స్కూలుకు వస్తావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత దారుణంగా చితకబాదారు. అయితే ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు. ఇక తల్లిదండ్రులు టీచర్లను వివరణ కోరగా ఇది చిన్న విషయమని ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందని విద్యార్థులను మందలించామని స్కూల్ టీచర్ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: