ప్లీజ్ నన్ను చంపెయ్.. మళ్లీ తిరిగొస్తా?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మంత్రాలకు చింత కాయలు రాలుతాయి అని నమ్మే జనాలు ఇంకా అక్కడక్కడా కనిపిస్తూ ఉన్నారూ అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇంకా క్షుద్ర పూజల పేరుతో ఎన్నో నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. మరి కొంత మంది ఏకంగా క్షుద్ర పూజలు చేస్తామని చెప్పి అందిన కాడికి దోచుకుంటున్నారు.

 ఇంకొంత మంది క్షుద్ర పూజలు పేరు తో ఏకం గా నర బలులు ఇస్తూ ఉన్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి దారుణ  ఘటన వెలుగు లోకి వచ్చింది. తాంత్రిక శక్తులను ఉపయోగించి భవిష్యత్తును మారుస్తానని చెప్పడం తో స్నేహితుడి మాట విన్న ఒక వ్యక్తి చివరికి దారుణం గా అతన్ని హత్య చేసి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజులో వెలుగు లోకి వచ్చింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీష్ సైని తన భవిష్యత్తు గురించి తరచూ ఆందోళన చెందుతూ ఉండేవాడు.

 ఈ క్రమం లోనే ఆరు నెలల క్రితం హరిద్వార్ కి వెళ్లిన నితీష్ ఇక ఆశిష్ దీక్షిత్ అనే వ్యక్తి  తో పరిచయం పెంచుకున్నాడు.  ఈ క్రమం  లోనే తన బాధలన్నింటినీ ఆశిష్ దీక్షిత్ కి చెప్పాడు. అయితే తనకున్న తాంత్రిక శక్తుల తో కష్టాలన్నీ తీరుస్తానని అతను హామీ ఇచ్చాడు. ఇటీవల నితీష్ ఆశిష్ లు కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక తనను చంపేయాలి అంటూ నితీష్ ను కోరాడు ఆశిష్.  తాను చనిపోయక తిరిగి వస్తానని తాంత్రిక శక్తులతో అద్భుతాలు సృష్టిస్తాను అంటూ చెప్పడంతో ఆ మాట విన్న నితీష్ నిజంగానే అతన్ని చంపాడు. ఇక ఆ తర్వాత పోలీసులు అతని అరెస్టు చేసి జైల్లో పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: