దారుణం : నిండు గర్భిణీ పై.. ఎలా దాడి చేశారో చూడండి?

praveen
మనుషుల్లో మానవత్వం అన్నది పూర్తిగా కనుమరుగైపోయింది అన్నదానికి నిదర్శనంగా నేటి ప్రజల్లో ఎన్నో తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటివి ఘటనలు చూసినప్పుడు సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా నిండు గర్భిణీగా ఉన్న మహిళపై దాడి చేయడానికి మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా సరే వెనకడుగు వేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఎందుకంటే గర్భిణీ పై దాడి చేస్తే ఒక పెద్ద పాపం చేసినట్లు అవుతుందని.. అలాంటి నీచమైన పనులు చేయడం మనిషికి తగదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు మాత్రం అలా ఆలోచించలేదు. ఏకంగా నిండు గర్భిణీ అయినా ఒక మహిళపై ఇక అతని భర్తపై కూడా దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సందీప్ అనే యువకుడు అతని భార్య ఉపాసనపై కూడా దారుణంగా దుండగులు దాడి చేసి కొట్టారు.

 ముందుగా అక్కడికి వచ్చిన కొంత మంది వ్యక్తులు ఆ యువకుడిని అతడి మామ గురించి ఆరా తీశారు. అయితే ఆ యువకుడు అతని మామ గురించి సరైన సమాధానం చెప్పలేదు అని చెప్పాలి. దీంతో అక్కడికి వచ్చిన గుంపు మొత్తం దుర్భాషలాడటం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత సందీప్ పై దాడి చేయడం ప్రారంభించారు. అయితే ఆపేందుకు భార్య ఉపాసన ప్రయత్నించగా ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు అని చెప్పాలి. దీంతో ఈ ఘటనలో నిండు గర్భిణీ అయిన ఉపాసన స్పృహ కోల్పోయింది. తర్వాత స్థానికులు వారి కేకలు విని అక్కడికి రావడంతో ఇక గొడవ సద్దుమణిగింది. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: