అయ్య బాబోయ్.. బంగారాన్ని ఎక్కడ దాచాడో తెలుసా?

praveen
అధికారులు ఎంతల నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ అటు అక్రమార్కుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నేటి రోజుల్లో ఎంతో మంది అక్రమార్కులు సరి కొత్త దారులను వెతుకుతూ ఇక మాదక ద్రవ్యాలు గంజాయి బంగారం లాంటివి ఇక అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యం గా ఇటీవల కాలం లో విదేశాల నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ స్వదేశానికి తీసుకువస్తున్న అక్ర మార్కుల సంఖ్య రోజుకు పెరిగి పోయింది అన్న విషయం తెలిసిందే.

 ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఎంతో చాకచక్యం గా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ అక్ర మార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇక వినూత్నమైన దారులను వెతుకుతూ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ  ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి నుంచి ఏకంగా 800 గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

ఈ ఘటన గురించి మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. ఇకపోతే ఇక ఎయిర్పోర్టులో నిందితుడు అనుమానాస్పదం గా కనిపించడం తో.. కస్టమ్స్ అధికారులు అతన్ని చెక్ చేసారు. అయితే ఎంత చెక్ చేసినా అతని వద్ద ఏమీ దొరక లేదు. కానీ అనుమానం వచ్చి ఏకం గా షూ విప్పమని కస్టమ్స్ అధికారులు కోరారు. నిందితుడు షూ  విప్పగా సాక్స్ లలో బంగారం దాచుకొని విమానం లో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు ఇక కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఏకం గా నిందితుడు దగ్గరనుంచి 957 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ బంగారం విలువ సుమారు 46 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.  నిందితున్ని అదుపులోకి తీసుకొని పోలీసులకూ అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: