ఆడబిడ్డ పుట్టిందనే ఆనందం.. అంతలోనే విషాదం?

praveen
నేటి రోజుల్లో ఆడబిడ్డ పుడితే భారం అనుకుంటున్నా రోజులు పోయాయి. ఏకంగా ఆడబిడ్డను అదృష్ట లక్ష్మిగా భావిస్తూ సంతోష పడిపోతున్న ఘటనలే చూస్తూ ఉన్నామని చెప్పాలి. అంతేకాదు ఆడబిడ్డ పుట్టాలని ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తున్న భార్యాభర్తలు కూడా నేటి రోజుల్లో కనిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఎంతో ఆశగా ఎదురుచూసిన సమయంలో ఇక అనుకున్నట్లుగానే ఆడబిడ్డ పుడితే ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోవడం ఖాయం అన్న విషయం తెలిసిందే.

 ఇలా కొన్ని కొన్ని సార్లు కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయిన సమయంలో విధి మాత్రం ఆ కుటుంబం విషయంలో కన్నుకుట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించిన విషాదాన్ని నింపి కుటుంబాన్ని అరణ్య రోదనలో మునిగిపోయేలా చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మనవరాలు పుట్టింది అని ఆనందంతో సదరు వ్యక్తి ఇటీవల అతిగా మద్యం తాగి నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అయ్యాడు సదరు వ్యక్తి.

 ఈ విషాదకర ఘటన చెన్నై లో వెలుగులోకి వచ్చింది. జూలై 7 ఇళంగో అడుగల్ వీధికి చెందిన సురేష్ కుమార్ అనే 52లో వ్యక్తి భవన నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. ఆ ఇంట్లో కుమారుడు స్టీఫెన్ రాజ్ కోడలు సుజిత ఉన్నారు. అయితే కోడలు ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే  తల్లి బిడ్డను కూడా కుటుంబ సభ్యులందరూ వెళ్లి పరామర్శించారు. అయితే సురేష్ కుమార్ ఇక మనవరాలు పుట్టిందన్న ఆనందంలో మిత్రులు సహజరులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు ఆరోజు రాత్రి ఆస్పత్రిలోనే ఉండడంతో.. సురేష్ కుమార్ ఇక ఆనందంలో ఇంటికి వెళ్లి అతిగా మద్యం సేవించాడు. చల్లటి ఏసి వేసుకొని నిద్రకు ఉపక్రమించాడు.

 మరునాడు తెల్లవారుజామున ఇక సురేష్ ఇంటి పై అంతస్తు నుంచి పొగ రావడాన్ని ఇరుగు పొరుగువారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే సురేష్ కుమార్ మంటల్లో సజీవ దహనమై పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గదిలో మద్యం బాటిల్లు సిగరెట్లు ఎక్కువగా ఉండడంతో అతిగా మద్యం సేవించినట్లు గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: