రెండోసారి సెక్స్ కు ఒప్పుకోలేదని భార్యను చంపిన భర్త !

VAMSI
పెద్దలు కుదిర్చిన పెళ్లి కావొచ్చు లేదా ప్రేమ వివాహం కావొచ్చు... ఏ విధంగా అయినా స్త్రీ పురుషులు కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడు జీవితాంతం ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండి ఆదర్శ దంపతులు గా పేరు తెచ్చుకోవాలి. అయితే కొందరు భార్య భర్తల విషయంలో అయితే చిన్న చిన్న కారణాలకు గొడవలు పడి విడాకుల వరకు వెళ్లి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరి కొందరు అయితే క్షణికావేశంలో హత్యలు చేసేంత స్థాయికి దిగజారిపోయారు. కానీ ఇలా రకరకాలుగా భార్య భర్తల మధ్య జరిగిన అఘాయిత్యాల గురించి మీరు తెలుసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు మనము చెప్పుకునే సంఘటన విన్న వారందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించక మానదు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఆర్మోహ జిల్లాకు చెందిన ఇద్దరు అన్వర్ (34) మరియు రుక్సార్ (30) భార్య భర్తలు తమ కొన్ని సంవత్సరాల కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కలిగారు. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే అన్వార్ తన భార్య రుక్సార్ ను సెక్స్ చేయడానికి రమ్మని పిలిచాడట. అందుకు ఒప్పుకుని ఒకసారికి సహకరించింది రుక్సార్.. కానీ ఒక్కరితో సంతృప్తి చెందని అన్వర్ మరోసారి సెక్స్ కు రావాలని ఆమెను అడిగాడట. అయితే అప్పటికే అలసిపోయిన రుక్సార్ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన అన్వర్ రుక్సార్ ను కత్తితో గొంతు కోసి హత్యా చేశాడు. ఆ తర్వాత శవాన్ని ఓ గోతాములో పెట్టి తన ఇంటికి కిలోమీటర్ల దూరంలో పడేసి వచ్చాడు.
కొద్దిపాటి సుఖం కోసం అన్ని సంవత్సరాలు సంసారం చేసిన భార్యను చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు పొద్దున్న తానే వెళ్లి నా భార్య కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో , కేసును దర్యాప్తు చేస్త్తున్న పోలీసులకు వేరే ప్రదేశంలో గుర్తు తెలియని శవం కనిపించడంతో విచారణ చేయగా అన్వర్ భార్య రుక్సార్ గా తెలిసింది. ఇక పోలీసులు తమ స్టైల్ లో విచారణ చేయగా అన్వర్ జరిగిన విషయాన్ని చెప్పాడు. కోర్ట్ లు చెబుతున్న ప్రకారం భర్త అయినా సరే తనకు ఇష్టం లేకుండా మీద చేయి కూడా వేయడానికి వీలులేదు. అలాంటిది సెక్స్ కు రెండు సార్లు సహకరించలేదని హత్య చేయడం పట్ల సర్వత్రా అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: