ఫుల్లుగా తాగి పక్కింట్లోకి వెళ్లిన ఎస్సై.. అప్పుడే అసలు ట్విస్ట్?

praveen
సాధారణంగా కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో ఉండే సన్నివేశాలు అచ్చంగా నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ సినిమాల్లో నవ్వులు తెప్పించిన సన్నివేశాలు మాత్రం నిజజీవితంలో జరిగితే ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాల్లో కొన్నిసార్లు ఏకంగా కమెడియన్లు బాగా మందు కొట్టిన తర్వాత ఇక మద్యం మత్తులో ఏకంగా వారి ఇంట్లోకి వెళ్లాల్సింది పోయి పక్కింట్లోకి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి అంటే చాలు  అక్కడ కామెడీ క్రియేట్ అయ్యి ప్రేక్షకులు బాగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ నిజ జీవితంలో ఇలాంటి తరహా ఘటన జరిగితే మాత్రం అందరూ షాక్ అవుతారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇంతకీ ఇలా తప్ప తాగి తన ఇంట్లోకి కాకుండా మరో ఇంట్లోకి వెళ్ళింది ఎవరో తెలిస్తే మరింత షాక్ అవుతారు. ఎందుకంటే ఏకంగా ఎంతో బాధ్యతగా నడుచుకోవాల్సిన ఒక ఎస్సై ఇలా తప్ప తాగి పక్కింట్లోకి వెళ్ళాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

 రాజాపూర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు శ్రీనివాస్. అయితే ఇటీవల మద్యం మత్తు లో ఆయన తన ఇల్లు అనుకుని పక్కింటికి వెళ్ళాడు. అయితే శ్రీనివాస్ సాదరణ దుస్తులలొ ఉండడం తో దొంగ అనుకొని ఇక స్థానికులు అతని దారుణం గా చెట్టు కట్టేసి చితక బాదారు. ఇక ఇదంతా జరిగిన తర్వాత అతను సాధారణ మనిషి కాదు ఎస్సై అని స్థానికులు కనిపెట్టారు. దీంతో అతన్ని వదిలేసారు. అయితే ఏకంగా బాధ్యతగా నడుచు కోవాల్సిన ఎస్ఐ ఇలా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.. మహబూబ్నగర్ జిల్లా పోలీసు వర్గాల్లో ఈ విషయం ఎంతో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: