హైదరాబాద్‌ లో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

Satvika
హైదరాబాద్‌ లో ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు నగర పోలీసులు.వెబ్ సైట్, వాట్సప్, కాల్ సెంటర్లు, యాడ్‌లలో కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లయ్‌ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ ముఠాకు చెందిన 17 మంది హ్యుమన్ ట్రాఫికర్లను అరెస్ట్ చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్.. భారీ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో 17 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. 15 సిటీల నుండి యువతులను రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని.. వెబ్ సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను పంపిస్తున్నారని తెలిపారు. నిందితులకు 39 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. 1419 మంది అమ్మాయిలు వ్యభిచార ముఠాలో చిక్కుకున్నట్లు గుర్తించామని.. వారందరికీ విముక్తి లభించిందని తెలిపారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సెక్స్ రాకెట్స్ తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్లకు ఎర వేస్తున్నారన్నారు. ఇప్పటికే సైబరాబాద్ లో ఐదు కేసులు నమోదు చేసి, విచారిస్తున్నామని తెలిపారు. మీడియేటర్లు, బ్రోకర్లు ద్వారా బాధిత మహిళలను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని తెలిపారు. విమానాల్లో కూడా అమ్మాయిలను ఇతర రాష్ట్రాల కస్టమర్ల దగ్గరకు పంపుతున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఇంకా బంగ్లాదేశ్, నేపాల్, రష్యాకు చెందిన అమ్మాయిలతోనూ సెక్స్ రాకెట్ దందా నడిపిస్తున్నారని తేలింది..


కరీంనగర్‌ నుంచి వ్యవహారాన్ని నడుపుతున్నారని.. సెక్స్‌ రాకెట్‌తో పాటు డ్రగ్స్‌ కూడా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఈ డ్రగ్స్, సెక్స్ రాకెట్‌లో ఆర్నవ్‌, సమీర్‌ కీలకంగా ఉన్నారని తెలిపారు. ఆర్నావ్ 915 మంది అమ్మాయిలను ముంబై, కోల్‌కతా నుంచి సప్లై చేయగా.. సమీర్ 850మంది యువతులను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఉద్యోగాలు, లగ్జరీ లైఫ్ ఎరగా చూపించి సమీర్‌, ఆర్నవ్‌ యువతులను సప్లై చేస్తున్నారని రుజువైంది..ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: