బాబా చెప్పినట్లు జరగలేదు.. దీంతో మహిళ ఏం చేసిందంటే?

praveen
ప్రస్తుతం అందరూ టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా అనాగరిక సమాజంలో బ్రతుకుతున్న వారు ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది  నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే. ఎందుకంటే నేటి రోజుల్లో ఏది కావాలన్న అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఒక్క క్లిక్ ఇస్తే జరిగిపోతుంది. అలాంటిది  ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మేవారు ఉన్నారు అని చెప్పాలి. ఇక ఏదైనా జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ కు పరుగులు పెడుతున్న వారు ఎక్కువ మంది అయితే అక్కడక్కడ నకిలీ బాబాల దగ్గరకు వెళ్లి తయాత్తు  కట్టిపించుకుంటున్న వారు కూడా ఉన్నారు కొంతమంది. అంతేకాదు ఇక ఆర్థిక కష్టాలు తీరుస్తామని చెప్పడంతో దొంగ బాబాల మాటలు నమ్మి లక్షలు మోసపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతుంది.

 ఇక జనాల మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది బురిడీ బాబాలు పూజల పేరుతో కావలసినంత గుంజుతూ చివరికి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మోసపోయామని గ్రహించిన ఎంతోమంది బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అంటే టెక్నాలజీకి మారుపేరుగా పిలుస్తూ ఉంటారు అందరూ.

 కానీ అలాంటి హైదరాబాద్ నగరంలో పూజల పేరుతో ఒక వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతని అరెస్టు చేసారూ హైదరాబాద్ పోలీసులు. పంజాబ్ లోని మొహాలీకి చెందిన లలిత్ జ్యోతిష్యం పేరుతో సమస్యలు తీరుస్తాను అంటూ నగరానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. పూజల పేరుతో పలు విడతలుగా 47 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే లలిత్ చెప్పినట్లుగా జరగకపోవడంతో బాధితురాలు ప్రశ్నించింది. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సదరు పూజారి. ఇక మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించిగా రంగంలోకి దిగిన పోలీసులు అతని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: