ఓరి నాయనో.. దొంగలు ఏం చోరీ చేశారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించాయి అంటే చాలు ఎంతో రహస్యంగా ఇంట్లోకి చొరబడటం ఇక అందిన కాడికి దోచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఎక్కడెక్కడ నిఘా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా దొంగల బెడద మాత్రం ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి. దీంతో ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు ఇంటి యజమానులు. ఇక ఏం దొంగలించాలి అనే విషయంపై పక్క ప్లానింగ్ వేసుకుంటున్న దొంగలు ఏకంగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విస్తరుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 అయితే ఇళ్లలో దొంగతనం చేస్తున్న వారే కాదు అటు రోడ్డుపై ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి చైన్లు ఎత్తుకెళ్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. మరికొన్ని ఘటనల్లో దారి దోపిడీలకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల కాలంలో కొంతమంది దొంగల ముఠాలు చేస్తున్న చోరీలు మాత్రం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా సెల్ టవర్ లాంటి భారీ వస్తువులను సైతం చాకచక్యంగా దొంగలించడం లాంటి ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే వెలుగు చూసింది.

 ఎవరు ఊహకందని విధంగా ఏకంగా రైల్ ఇంజన్ ని దొంగతనం చేశారు ఓ దొంగల ముఠా. ఈ ఘటన బీహార్లోని బెగుసరాయి జిల్లాలో వెలుగు చూసింది. రైల్వే యార్డులోకి సొరంగం తవ్విన  దొంగలు రిపేర్ కోసం ఉన్న డీజిల్ ఇంజన్ పార్ట్ లుగా చేసి సంచుల్లో మూటగట్టుకుని పాత ఇనుప సామాన్ గోడౌన్ కు తరలించారు. ఇలా క్రమంగా మొత్తం రైలు ఇంజన్ ఎత్తుకెళ్లారు. దీంతో షాక్ అయిన రైల్వే అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. ఇక రైలు ఇంజన్ పార్ట్ లు ఎక్కడ ఉన్నాయని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: