మందు బాబుకు షాక్.. బీర్ సీసాలో ఏం వచ్చిందో తెలుసా?

praveen
సాధారణంగా మద్యం ప్రియులు కాస్త ఎక్కువగా దాహం వేసింది అంటే చాలు నీళ్లను తాగడం కాదు ఏకంగా దగ్గరలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ ఒక చల్లటి బీరు కొనుగోలు చేసి వెంటనే ఆ బీరు ఓపెన్ చేసి గుట గుట తాగేస్తూ దాహం తీర్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ముందు వెనక చూడకుండా ఇలా బీర్  అమాంతం తాగేస్తే మాత్రం చివరికి ప్రాణాలు మీదికి వచ్చేస్తుంది అన్నదానికి నిదర్శనమైన ఘటనలు ఇప్పటివరకు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఏకంగా బీరు సీసాలో పాములు, బల్లులు లాంటివి ఏకంగా చనిపోయి ఉండడం లాంటి ఘటనలు కూడా ఇప్పటివరకు చాలానే వెలుగు చూసాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం మరోసారి బీరు తాగే ముందు సీసాలో ఏమైనా ఉందా లేదా అన్నది ముందుగానే చెక్ చేసుకుంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక మద్యం ప్రియుడు ఎంతో ఉత్సాహంగా బీరు తాగడానికి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి చేదు అనుభవమే ఎదురయింది అని చెప్పాలి. ఏకంగా తాను ఆర్డర్ చేసిన బీరుసీసాలో ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. దీంతో సదురు మద్యం ప్రియుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

 ఇల్లంతకుంట లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక తాను ఆర్డర్ చేసిన బీరులో ప్లాస్టిక్ కవర్ రావడంతో షాక్ అయిన సదరు వ్యక్తి వెంటనే ఇక దాబా ఓనర్ను పిలిచి ఇదేంటి ఇలా జరిగింది అంటూ ప్రశ్నించాడు. దీంతో ఇదే విషయంపై ఇక ఇద్దరి మధ్య వాదన జరగ్గా.. వాదన కాస్త గొడవకు దారితీసింది అని చెప్పాలి. అయితే అక్కడే ఉన్న మిగతా వ్యక్తులు కలగజేసుకోవడంతో చివరకు గొడవ సద్దుమణిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.  మందు బాబుల ప్రాణాలతో చెలగాటమాడుతూ  వ్యాపారులు ఆటలాడుకుంటున్నారని మద్యం ప్రియులందరూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: