కడుపున పుట్టిన పిల్లలతో.. క్షుద్ర పూజలు.. చివరికి?

praveen
మంత్రాలు తంత్రాలు లాంటివి లేవని దయ్యాలు భూతాలు అనేవి కేవలం ఒక ఆపోహ మాత్రమే అని ఎప్పటికప్పుడు అటు అధికారులు జనాలకు అవగాహన కల్పించడంలో నిమగ్నం అయిపోతున్నారు అని చెప్పాలి. అయితే నేటి ఆధునిక సమాజంలో ఇలాంటివి నమ్మడం కూడా ఎంతోమంది మానేశారు అని చెప్పాలి. కానీ పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లుగానే అక్కడక్కడ ఇంకా మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి దారుణాలకు పాల్పడుతున్న మనుషులు ఉన్నారు అన్నది మాత్రం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.

 ఇక్కడ ఇలాంటి మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇద్దరు మహిళలను దారుణంగా నరబలి ఇచ్చి ఇక నర మాంసం వండుకొని తిన్న ఘటన కేరళలో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఘటన గురించి మరవక ముందే మరో క్షుద్ర పూజలకు సంబంధించిన ఘటన వెలుగు చూసింది. ఏకంగా కడుపున పుట్టిన పిల్లలను క్షుద్ర పూజలకు వినియోగించింది ఓ మహిళ. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు మంత్రగత్తెను అరెస్టు చేశారు పోలీసులు. పతనం తిట్ట జిల్లాలోని మలయాళ పూజ పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్ర పూజలు చేస్తుంది.

 ఏకంగా కడుపున పుట్టిన పిల్లలను తన ముందు కూర్చోబెట్టుకుని క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టింది.  ఈ క్రమంలోనే క్షుద్ర పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహ తప్పి చివరికి కింద పడిపోయింది. అయితే స్థానికులకు ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా సదరు మంత్రగత్తెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఇక క్షుద్ర పూజలు చేస్తున్న మహిళను అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరపించబోము అంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో డి.ఎస్.పి  కలిపించుకొని సదర మహిళలను అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: