పురుగుమందు పిచికారి చేసి.. ప్రాణం వదిలిన రైతు?

praveen
ఆరుగాలం కష్టపడి పంట పండించి నలుగురి కడుపు నింపే రైతన్నకు అడుగున కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ప్రభుత్వాలనుంచి ఇంకొన్నిసార్లు అటు ప్రకృతి నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో ఆటుపోట్లను దాటుకుని పంటను పండించి ఇక ఎంతోమందికి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లేందుకు రైతన్న చెమటోడ్చి కష్టపడుతూ ఉంటాడు అని చెప్పాలి. పంట వేసిన నాటి నుంచి ఇక అది చేతికొచ్చే సమయం వరకు కంటికి రెప్పల కాచుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.

 కొన్ని కొన్ని సార్లు రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏకంగా ప్రాణాల మీదికి తేవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఎలాంటి పంటలోనైనా సరే కలుపు నివారణల కోసం రసాయన మందులు వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే. పంట పొలంలో ఇలా రసాయన మందులు పిచికారి చేసిన సమయంలో రైతులు ఎన్నో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది రైతులు మాత్రం జాగ్రత్తలు పాటించకుండా పురుగుల మందులు పిచికారీ చేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు.

 పత్తిలో దోమ మందు పిచికారి చేసిన ఓ యువ రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రిలో మూడు రోజులపాటు చికిత్స పొందిన రైతు చివరికి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం మానవత్ తండాలో వెలుగులోకి వచ్చింది. రామవత్ శ్రీను నాయక్ అనే 27 ఏళ్ల యువరైతు రెండున్నర ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటను దోమ ఆశించింది. దీంతో తెగులు నివారణకు  ఇటీవల పురుగుల మందు పిచికారి చేశాడు. ముఖానికి ఎలాంటి రక్షణ ఏర్పాటు చేసుకోకపోవడంతో పురుగుమందు పీల్చి అస్వస్థకు గురై కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చివరికి సదరు యువరైతు మృతి చెందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: