తక్కువ కులం డాక్టర్ పోస్టుమార్టం చేశాడని.. చివరికి శవాన్ని?

praveen
నేటి ఆధునిక యుగంలో కూడా కులం మతం అన్నది ఇంకా అక్కడక్కడ పేరుకుపోయి ఉందన్న విషయం వెలుగులోకి వస్తూనే ఉంది.  ముఖ్యంగా దళితులు ముట్టుకున్నారు అన్న కారణంగా ఏకంగా విలువైన వస్తువులను కూడా పడేయడం లేదా తగలబెట్టడం లాంటి ఘటనలు కూడా సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వెలుగు చూస్తున్నాయ్. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది అని చెప్పాలి. ఒక దళిత డాక్టర్ శవానికి పోస్టుమార్టం నిర్వహించాడు అనే కారణంతో చివరికి శవాన్ని వదిలేయడానికి కూడా సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు.

 తక్కువ కులం వ్యక్తి ముట్టుకున్నాడు అన్న కారణంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టారు   అని చెప్పాలి. ఈ ఘటన ఒడిస్సా రాష్ట్రంలోనే బర్కా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ముచ్చున సంద అనే వ్యక్తి రోజు కూలిగా పని చేస్తూ ఉంటాడు. అతనికి భార్య సంధ్య గర్భిణి కావడం గమనర్హం. వారికి అప్పటికే మూడేళ్ల కూతురు కూడా ఉంది.  లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు సదరు వ్యక్తి. పది రోజుల క్రితమే అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. కాగా అతడికి పోస్టుమార్టం నిర్వహించి అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించారు.

 శవాన్ని ఇంట్లో దిగబెట్టి అంబులెన్స్ ని పంపించారు. ఆ సమయంలోనే ఇక అక్కడ ఉన్న బంధువులకు ఒక విషయం తెలిసింది. సంద మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది తక్కువ కులానికి చెందిన వైద్యుడు అన్న విషయం తెలుసుకుని దారుణంగా వ్యవహరించారు. అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. ఏకంగా శవాన్ని చూడడానికి కూడా ఇంటికి వెళ్ళలేదు. చివరికి గ్రామ సర్పంచ్ ముందుకు వచ్చి బైక్ మీద మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు అని చెప్పాలి. ఇక శవాన్ని తీసుకొచ్చిన అంబులెన్స్ కి కూడా చందాలు వసూలు చేసి చార్జీలు చెల్లించడం గమనార్కం. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఘటన అందరిని అవాక్కేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: