వంట విషయంలో గొడవ.. యజమానులను నరికి చంపిన పని మనిషి?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే నేటి సభ్య సమాజంలో బ్రతుకుతున్నది మనుషులా లేకపోతే మనిషి రూపంలో ఉన్న మానవ మృగాల అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.  సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కాస్తయినా వెనక ముందు ఆలోచించడం లేదు నేటి రోజుల్లో మనుషులు. వెరసి ఎక్కడ చూసినా రక్తపాత మే కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  సాధారణంగా వంట మనిషి అంటే ఇంటి యజమానులతో ఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ ఉంటారు.

 ఇంటి యజమానులకు ఇష్టమైన వంటకాలు చేస్తూ ఇక అన్ని పనులు చక్కగా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ పని మనిషి మాత్రం అలా చేయలేదు. తాను పనిచేస్తున్న ఇంటి యజమానులు దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. భోజనం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టాడు అని చెప్పాలి. పిల్లల పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా బాలుడు తప్పించుకుంటే ఇక బాలికకు గాయాలయ్యాయి. గగుర్పాటుకు గురి చేసే ఈ ఘటన జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

 నిందితుడు సత్యేంద్ర  లక్రా కొన్నాళ్ల క్రితం రిచర్డ్, మెలేని మింజ్ దంపతుల వద్ద వంట మనిషి గా పని చేస్తూ ఉన్నాడు. అయితే భోజనం విషయంలో రిచర్డ్,వంట మనిషికి మధ్య గత కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. ఆ సమయంలో సత్యేంద్ర ను రిచర్డ్  హెచ్చరించాడు.  దీంతో ఇది మనసులో పెట్టుకుని  ఎలాగైనా కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలి అని నిర్ణయించుకున్నాడు. ఓరోజు పదునైన గొడ్డలితో రిచర్డ్ దంపతులను దారుణంగా నరికి చంపేశాడు. వారి పిల్లల పైన కూడా కనికరం చూపకుండా దారుణంగా దాడి చేశాడు. బాలుడు తప్పించుకో ఒక బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు నిందితుని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: