ఐదో పెళ్లికి సిద్ధమైన తండ్రి.. ట్విస్ట్ ఇచ్చిన పిల్లలు?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అప్పటికే అతనికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో మరో పెళ్ళికి సిద్ధమయ్యాడు ఆ ప్రబుద్ధుడు. విషయం తెలిసిన అతని రెండో భార్య ఏడుగురు పిల్లలు బంధువులతో కలిసి చివరికి ఐదో వివాహాన్ని అడ్డుకున్నారు. అంతేకాదు పెళ్లి కుమారుడిగా ముస్తాబైన సదరు వ్యక్తిని దాడి చేసి దారుణంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఈ ఘటన తో ఒక్కసారిగా భయపడిన వధువు అక్కడి నుంచి పారిపోయింది.
యూపీలోని మొహల్లా కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి రోడ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. గతంలో నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు సంతానం కలిగారు. రెండో భార్యకు దూరంగా ఉంటూ ఆమెకు సైతం విడాకులు ఇచ్చాడు. ఎవరికి తెలియకుండా మూడో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇంకో పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఐదో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కాగా ఈ విషయం రెండో భార్య పిల్లలకు తెలిసింది. దీంతో ఏకంగా పెళ్లి మండపానికి చేరుకున్న వారు వరుడిపై దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.