చిన్న గొడవ.. భర్త చేసిన పనికి అందరు షాక్?

praveen
సాధారణం గా  భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి.. కానీ ఇటీవలి కాలం లో మాత్రం మూడు ముళ్ల బంధంతో ఒకటవుతున్న భార్య భర్తలు బద్ద శత్రువులు కంటే దారుణం గా ఒకరినొకరు అసహ్యించుకుంటున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఏకంగా పచ్చని కాపురం లో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్నారు ఎంతో మంది. ఇలా నేటి రోజుల్లో మూడుముళ్ల బంధం తో ఒకటవుతారు కొన్నాళ్ళ వరకు మాత్రమే కలిసి ఉండగలు గుతున్నారు. ఆ తర్వాత విడాకులు కావాలి అంటూ కోర్టులను ఆశ్రయిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి.

 అయితే ఇలా మనస్పర్ధల తో విడి పోయి విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నా పర్వాలేదు. కానీ ఇటీవలి కాలం లో భార్య భర్తలు మరింత దారుణం గా వ్యవహరిస్తున్నారు.  సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన వారే కట్టుకున్న వారిని దారుణం గా హత్య చేసిన ఘటన వెలుగు లోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత నేటి రోజుల్లో యువత పెళ్లి పేరెత్తితేనే భయపడే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 భార్యను భర్త పిస్తోలుతో కాల్చి హత్య చేసిన దారుణమైన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కొడగు సోమవార పేట తాలూకా బెట్టల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. కిషన్ అలియాస్ గోపాల్ చస్మా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే దంపతులిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన కిషన్ తన వద్ద ఉన్న పిస్తోలు తో చస్మా పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: