మళ్లీ వరద వస్తుందనే భయం.. ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవలే తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పరిస్థితులు ఎంత అతలాకుతలం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జనావాసాలు మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోవడంతో ఎటు పోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కి వెళ్ళిపోయారు ఎన్నో గ్రామాల ప్రజలు. ఈ క్రమంలోనే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది.

 దీంతో ప్రతి ఏడాది జరిగే నష్టం కంటే ఈ ఏడాది కాస్త ఎక్కువ నష్టమె జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఏపీలోని గోదావరి వరదలు ఎన్నో గ్రామాల్లోని ప్రజలను అతలాకుతలం చేశాయి. దీంతో ఇక ప్రాణాలు ఉంటాయో ఊడుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవితం గడిపారు అందరు.  అయితే మరోసారి వరద వచ్చే ప్రమాదముందని భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసే ప్రతిక్షణం భయపడుతూ బ్రతికె పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఇక గోదావరి వరదల్లో ముంపు ప్రాంతాలుగా  ఉన్న వర రామచంద్రపురం,కూనవరం మండలంలో ముందు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పాలి.

 వరదల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి హాయిగా బ్రతకడం మేలు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తెలంగాణ రాష్ట్రం  తరలి వెళ్తున్నారు అని చెప్పాలి.అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర రామచంద్రపురం మండలం నుంచి మినీ లారీ లో సామాగ్రిని తరలిస్తున్న బాధితులు నందిగామ వద్ద కనిపించడం గమనార్హం. ఎందుకు వెళ్తున్నారు అని వారిని ప్రశ్నిస్తే మొన్నటి వరకు వచ్చిన వరదల కారణంగా పడరాని కష్టాలు పడ్డాము. మళ్లీ వరద వస్తే తట్టుకునే ఓపిక లేదు అందుకే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గదులు అద్దెకు తీసుకుని అక్కడికి వెళ్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: