అబ్బాయితో ఆంటీ పరార్.. ఇదెక్కడి గోల..

Deekshitha Reddy
ఆమె వయసు 35 ఏళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి. ఆ అబ్బాయి వయసు 15 ఏళ్లు, స్కూల్ కి వెళ్తున్నారు. వారిద్దరికీ పరిచయం ఉంది. ఒకరింటికి ఇంకొకరు వెళ్తారు, కుటుంబ సభ్యులతో కూడా సరదాగా గడుపుతారు. అంతా బాగానే ఉంది కానీ నిన్నటి నుంచి వారిద్దరూ కనపడటంలేదు. ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పలేదు, అసలెక్కడికి వెళ్లారో తెలియదు. ఒకరితోపాటు ఇంకొకరు ఇద్దరూ కనపడకపోయే సరికి అసలేం జరిగిందోనని ఆందోళనపడుతున్నారు కుటుంబ సభ్యులు. వారిద్దరి సంబంధంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గుడివాడలోని గుడ్‌ మెన్ పేట కాలనీలో ఈ వ్యవహారం బయటపడింది. ఆ కాలనీలో 15 ఏళ్ల బాలుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి ఎంతకీ తిరిగి రాకపోయే సరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా జాడ కనపడకపోయే సరికి పోలీస్ కేస్ పెట్టారు. కిడ్నాప్ కేస్ నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నారు. ఈలోగా మరో విషయం బయటపడింది. వారి ఎదురింట్లో ఉంటున్న ఆంటీ కూడా మాయమైంది. సరిగ్గా ఆ అబ్బాయి వెళ్లిపోయిన సమయానికే ఆమె కూడా ఇంటినుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరికీ ఏమీ తెలియదు. మరి వారిద్దరూ కలసి వెళ్లారా, లేక విడివిడిగా వెళ్లారా..? ఇద్దరి అదృశ్యం వెనక ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది.
వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలియదు కానీ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే తమ పిల్లవాడిని ఆమె కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉంటుందని, డబ్బులకోసమే ఇదంతా చేసి ఉంటుందని పిల్లవాడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివాహిత ఆచూకీ కనిపెట్టాలని వారు పోలీసుల్ని వేడుకుంటున్నారు. మిస్టరీ కేసు ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు ఆ వివాహిత కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. వారికి ఈ విషయంపై ఏమైనా సమాచారం తెలుసో లేదో ఎంక్వయిరీ చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె ఫోన్ కాంటాక్ట్ లోకి వస్తే కాని అసలు విషయం తెలియదని అంటున్నారు. ఈలోగా వారు ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఆరా తీస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లోనీ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: