అయ్యో రేణుకా.. నమ్మిన వాడే ఇలా చేశాడే?

praveen
ప్రేమ అనేది నేటి రోజుల్లో ఎంతో మందికి ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. కేవలం అవసరాలను తీర్చుకునే ఒక ఆయుధంగా ఎంతోమంది మోసగాళ్లు ప్రేమను ఉపయోగించుకుంటున్నారు. నువ్వంటే ఇష్టమని నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఎన్నో మాయమాటలతో నమ్మిస్తున్నారు. చివరికి ఎంతో మంది యువతులను నట్టేట ముంచుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి చేతిలో మోసపోయిన ఎంతో మంది యువతులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.

 ప్రజలు ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.. ప్రియుడు మోసం చేశాడని తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల ముందు మొరపెట్టుకుంది యువతి. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం దేవపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణ గౌడ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన పిట్టల రేణుక ను ప్రేమించాడు. ఇక ఇద్దరు ఎన్నో రోజుల పాటు ప్రేమించుకున్నారు. అయితే 8 ఏళ్లుగా తాము ప్రేమించుకున్నామని బాధితురాలు ఇటీవలే పోలీసుల ముందు తెలిపింది. ఇక జూన్ 17వ తేదీన సత్యనారాయణ గౌడ్ తనను హైదరాబాద్లోని ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.

 ఈ క్రమంలోనే నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ చెప్పిన సత్యనారాయణ గౌడ్ పెళ్లి జరిగిన తర్వాత ఐదు రోజుల వరకు మాత్రమే తనతో కలిసి ఉన్నాడు అంటూ బాధితురాలు బాధను వెలిబుచ్చింది. ఆ తర్వాత నన్ను వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుంచి సత్యనారాయణ గౌడ్ వస్తాడేమో అని ఎదురుచూస్తూ ఉన్నాను.  కానీ అతడు మోసం చేశాడు అన్న విషయం అర్థమైంది. అందుకే ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాను అంటూ ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. ఈ ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. అయితే పోలీసులు సరిగా స్పందించకపోవడంతో సత్యనారాయణ గౌడ్ ఇంటిముందు న్యాయపోరాటం చేస్తున్న  అంటూ రేణుక చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: