సినిమా రేంజ్ చేజింగ్.. కోర్టు ఆవరణలో ఎటాక్?
ఇక చంపాల్సిన టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎంత మంది లో ఉన్న ఎవరు పక్కన ఉన్న పట్టించుకోకుండా చివరికి హత్య చేసి మెల్లగా అక్కడి నుంచి జారుకోవడం లాంటివి నేటి రోజుల్లో ఎంతో మంది క్రిమినల్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పంజాబ్లోని మోగా జిల్లాలో కోర్టు ఆవరణలో షాకింగ్ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు సన్ని అనే వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారు. ఎలాగైనా అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మోగాలోని కోర్టు ఆవరణలో సన్నీ ఉన్నట్లు తెలుసుకుని వెంటనే అతనిని ఫాలో అయ్యారు.
కోర్టు ఆవరణ.. అక్కడ పోలీసులు ఉంటారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అతనిపై కాల్పులు జరిపారు. కానీ అదృష్టవశాత్తు అతను మాత్రం త్రుటిలో తప్పించుకున్నాడు అనే చెప్పాలి. ఇక ఈ ఛేజ్ ఏకంగా సినిమా కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితేఇక ఈ ఘటన తర్వాత అదే కోర్టు ఆవరణలో ఉన్న పోలీసులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులు ఉన్నచోటే ఇలాంటి ఘటనలు జరిగితే ఇక పోలీసులు లేని చోట ఎలాంటి ఘటనలు జరుగుతాయో అని కొంతమంది భయాందోళన చెందుతున్నారు అని చెప్పాలి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.