పోస్టల్ సిబ్బంది లోడింగ్.. అంతలో కదిలిన పార్సల్.. ఓపెన్ చేస్తే?

praveen
సాధారణంగా పోస్టల్ ఉద్యోగులు ప్రతి రోజూ ఎన్నో రకాల పార్సిల్ లను  గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎలాంటి పాత్రలు వచ్చినా కూడా వాటిని అసలు తెరిచి చూడరు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ పోస్టల్ ఉద్యోగులకు వింత అనుభవం ఎదురైంది. తమ దగ్గరికి వచ్చిన ఒక పార్సల్ కదులుతూ కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక ఆ బాక్స్ ని పరిశీలించగా సూర్యరశ్మి తగలనివ్వద్దు అని బాక్స్ మీద రాసి ఉంది. అంతేకాదు ఆ బాక్స్ కి రెండు వైపులా రంధ్రాలు కూడా ఉండటం గమనార్హం.

 దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోస్టల్ సిబ్బంది వెంటనే అనుమానంతో అక్కడ బాక్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆ బాక్స్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దీంతో కాస్త జాగ్రత్తగానే బాక్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. ఇక లోపల ఒక పెద్ద కింగ్ కోబ్రా  కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనలో మునిగిపోయారు. ఇక వెంటనే ఉద్యోగులు స్థానిక జంతు సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న జంతు సంరక్షణ బృందం దాదాపు 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా రెస్క్యూ చేశారు అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

 ఈ ఘటన ఈశాన్య థాయిలాండ్ లోని ఖేన్ ఖోన్ ప్రావిన్స్ లో వెలుగులోకి వచ్చింది. అయితే సదరు పార్సిల్ పోస్టల్ సిబ్బంది వరకు ఎలా వచ్చింది అన్న విషయాలను తెలుసుకొని సదరు వ్యక్తిని పిలిచి విచారించారు. అందులో పాము ఉంది అన్న విషయాన్ని సదరు వ్యక్తి ఒప్పుకోవడం గమనార్హం. అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప తాము కస్టమర్ల పార్సిల్ ఓపెన్ చేయమని అక్కడి సిబ్బంది తెలిపారు. అంతే కాకుండా ఎటువంటి జీవులను పోస్టల్ ద్వారా డెలివరీ చేయకూడదు అంటూ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు చెప్పడం గమనార్హం. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: