బాలికపై యువకుడి కన్ను.. చివరికి గర్భం దాల్చింది?

praveen
ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇలా తరచూ వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతే కాదు అందరూ మంచి వాళ్ళ ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో క్షణక్షణం భయపడుతూ ఆడపిల్ల బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా సృష్టికి మూలమైన ఆడపిల్లకు నేటి రోజుల్లో కనీసం రక్షణ లేకుండా పోయింది.

ప్రభుత్వాలు ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేయిస్తున్న అటు కామాంధుల తీరులో  మాత్రం మార్పు రావడంలేదు. ఒంటరిగా కనిపించే ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్న వారు కొంతమంది అయితే మంచి వాళ్ళ ముసుగులో సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ చివరికి దారుణంగా అఘాయిత్యాలకు  పాల్పడుతున్న వారి మరికొంతమంది. ఇలా ప్రతి రోజు రోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికపై కొన్నాళ్ల నుంచి అత్యాచారం చేస్తూ వస్తున్న యువకుడు చివరికి బాలికను గర్భవతిని చేశాడు. పల్నాడు జిల్లా నరసారావు పేట లోని ప్రకాష్ నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. బాలికపై మున్నా అనే యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఇటీవలి వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించగా ఏడు నెలల గర్భవతి గా తేలింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయిన బాలిక తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. ఇక బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడు మున్న పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: