స్టీల్ రాడ్డు గొంతులోకి.. చివరికి ప్రాణం పోయింది.. ఏం జరిగిందంటే?

praveen
విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలు లాంటివి మాత్రమే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటివి విన్నప్పుడు నేటి జనరేషన్ జనాలు కేవలం ట్రాష్ మాత్రమే అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ అనుకోని విధంగా కొన్నిసార్లు సంభవించిన ఘటనలు మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. నిజంగానే మనుషుల జీవితాలు దేవుడి చేతిలో కీలుబొమ్మలనీ నమ్మేలా చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతున్న సమయంలో అనుకోని విషాదం ఘటనలు ప్రాణాలు తీసేస్తూ ఉంటాయి.

 ఇక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ జరిగిన ఘటన ఇలాంటిదే అని చెప్పాలి.  ఆ కుటుంబం మధ్య తరగతిలో బ్రతుకుతున్న వచ్చిన దానితో సర్దుకుపోతూ ఎంతో సంతోషంగానే ఉంది. కానీ వారి ఆనందాన్ని చూసి మాత్రం వీధి ఓర్వలేక పోయింది. ఎలాగైనా వారి కుటుంబంలో విషాదం నింపాలి అని భావించింది. చివరికి ఇంటి పెద్దగా ఉన్న వ్యక్తిని దూరం చూసి ఆ కుటుంబాన్ని రోడ్డున పడే పరిస్థితి ని తీసుకువచ్చింది. అంతేకాకుండా శోక సముద్రం లోకి నెట్టింది. ఏకంగా ఒక వ్యక్తి గొంతులో ఇనుప రాడ్ దూసుకెళ్లి ప్రాణాలు వదిలినా విషాదకర ఘటన చిన్న శంకరం పేట మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది.

 మండలంలోని ఒక స్టీలు పరిశ్రమ లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. ఒడిషాలోని గంజాం జిల్లా కు చెందిన గుర్రం నాయక్ అనే 36 ఏళ్ల వ్యక్తి స్టీల్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక ఎప్పటి లాగానే ఇటీవలే విధులకు హాజరయ్యారు సదరు వ్యక్తి. అయితే ఇక తనకు ఉపాధి ఇస్తున్న స్టీల్ కంపెనీలోనే తన మృత్యువు వేచి చూస్తోంది అన్న విషయాన్ని గ్రహించలేక పోయాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు స్టీల్ రాడ్ గొంతులోకి తీసుకువెళ్లి మృతిచెందాడు. ఇది కాస్త సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: