భార్యకు మరొకరితో వివాహం.. తట్టుకోలేక భర్త సూసైడ్..

Satvika
ఈరోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ అవుతున్నాయి..తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని కొంతమంది జంట ఆత్మహత్యకు పాల్పడుతున్నారు..మరి కొన్ని పెళ్ళిళ్ళు పరువు హత్యగా మిగిలి పోతున్నాయి.ఇప్పుడు మరో విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది. తను పెళ్ళి చేసుకున్న యువతిని వేరే వ్యక్తి తో పెళ్ళి చేసారని తెలుసుకోలేని భర్త భరించ లేక సూసైడ్ చేసుకొని చనిపోయారు..అనంతపురంలోని గౌరీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న బాలకృష్ణ సింగ్ రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుమలకు వెళ్లిన ఆయనకు కలువాయి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది.


ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను కావలిలోని తమ బంధువుల ఇంట్లో ఉంచి వివాహానికి ప్రయత్నాలు చేశారు. దీంతో గతేడాది మేలో బాలకృష్ణ సింగ్, యువతి పారిపోయి వివాహం చేసుకుని అనంతపురంలో కాపురం పెట్టారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన కావలి పోలీసులు అనంతపురంలో ఉన్న వీరిని తీసుకువచ్చారు..తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పదిరోజుల్లో వివాహం చేస్తామని తమ కుమార్తెను వెంట తీసుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో బాలకృష్ణ సింగ్ పెట్టడంతో యువతి కుటుంబ సభ్యులు దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విచారణ హాజరు కావాలని కోరారు.. అతను రాగానే అతని నుంచి మొబైల్ ఫోన్ ను లాక్కొని ఫోటోలను డిలీట్ చేయించారు.ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటిరోజు కౌన్సెలింగ్ చేశారు.


ఈ క్రమంలో తన కుమార్తె వివాహం చేశామని, ఆమె జోలికి రావద్దని తల్లిదండ్రులు సూచించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఫోన్ కోసం దిశ పోలీస్ స్టేషన్ కు బుధవారం బయలుదేరిన బాలకృష్ణ సింగ్.. సమీపంలోని చెట్ల వద్ద తలకు రాసుకునే ఆయిల్ ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం జిజిహెచ్ లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసును అదే రోజు అర్ధరాత్రి నమోదు చేశారు.. ఈ కేసు గురించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: