అయ్యో పాపం..భూమ్మీద పడగానే చిన్నారికి ఎంత కష్టం వచ్చింది..!

Satvika
ప్రేమ, సరదాలు, కామకొరికలు ఇలాంటి వాటికి ఈరోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.. కేవలం శారీరకంగా దగ్గర అవ్వడం కోసం ప్రేమ అనే పదాన్ని ఎక్కువగా వాడు తున్నారు. తీరా కోరికలు తీరాక ఎవరి దారి వాళ్ళు వెళ్ళి పోతున్నారు. కానీ కొన్ని సార్లు మాత్రం గర్భం వస్తుంది. తీయించుకొలెని పరిస్థితి ఎదురైతే మాత్రం బిడ్డను కనే వరకు ఉంటారు. తీరా కన్నాక ఆ పాపం ఎవరిదో అని చెత్త కుప్పలో పదెస్తున్నారు. దారుణం.. ఇలాంటి వాటి గురించి మాట్లాడటం కూడా పాపం అనే చెప్పాలి. ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.కళ్ళు కూడా పూర్తిగా తెరవని ఓ పసికందుని ముళ్ళ పొదల్లొ వదిలేసి వెళ్ళారు .. ఉదయం పిల్లాడి అరుపులు వినిపించి అక్కడకు వెళ్ళి చూసి పోలీసులకు పిర్యాదు చేశారు.

 
వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. నవమాసాలు మోసి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరో కానీ, ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. అప్పుడేపుట్టిన మగ శిశువును ముళ్లపొదలో పారవేసింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే పోలీసులు, సమీప ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. శిశువుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలిలా..


శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన మగశిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. తెల్లవారుజామున ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మగ శిశువును ముళ్ళ పోదలు కింద వదిలేసి వెళ్లారు. శిశువు ఏడుపు శబ్ధాలు విన్న స్థానికులు పసికందును చూసి నివ్వెర పోయారు. వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆస్పత్రి మగ శిశువును ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు..వాళ్ళు బిడ్డకు అన్నీ పరీక్షలను నిర్వహిస్తున్నారు... పిల్లాడి తల్లి దండ్రుల గురించి వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: