వీడియో కాల్ లింకు పంపిన యువతి.. ఓపెన్ చేస్తే?

praveen
ఏంటో ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ఆ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు కేటుగాళ్లు  చివరికి  అమాయకులను టార్గెట్గా చేసుకుని మాయ మాటలతో నమ్మించి నట్టేట్లో ముంచేస్తున్న ఘటనలు  ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో హాని ట్రాప్ వలలో చిక్కుకొని మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలీ. ఇక్కడ ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది.

 ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతి చివరికి యువకుడు కొంపముంచింది. వలపు వల వేసి ఖాతా నుంచి 2.5 లక్షల రూపాయలు కాజేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం సమీపంలో వెలుగులోకి వచ్చింది. జాండ్రపేట కు చెందిన దేవన గణేష్ జీవనోపాధి కోసం ఉంగుటూరు మండలం చేబ్రోలు కు వచ్చాడు. గోపాలపురంలో సూపర్ వైజర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే అతనికి ఫేస్బుక్ ద్వారా ప్రీతి అనే యువతి పరిచయమైంది. ఆ తర్వాత టెలిగ్రాం వేదిక ఇద్దరు సందేశాలు పంచుకున్నారు. ఇక వీడియో కాల్ చేసుకుందామని యువతి ఒక లింకు గణేష్ మొబైల్ కి పంపింది.

 ఈ క్రమంలోనే అతను కూడా లింకు ఓపెన్ చేసాడు. అయితే తన దగ్గర నెట్ బాలన్స్ లేవు 20 రూపాయలు తనకు పంపాలి అంటూ సూచించింది. 20 రూపాయలే కదా అని అతను కూడా పంపించాడు. కొద్దిసేపటికే అతని నుంచి 2.5 రూపాయలు ఖర్చు అయినట్టు చరవాణి కి సందేశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగు తిని బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ఒక బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు తెలిసింది. దీంతో మోసపోయాను అని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: