ఏంటీ.. నన్ను ప్రేమించవా.. యువకుడు దారుణం?

praveen
ఇటీవలి కాలంలో ప్రేమ ఎన్నో హత్యలకు కారణమవుతుంది. సాధారణంగా ప్రేమించిన వ్యక్తి ఇక తన ప్రేమను వ్యక్త పరచడం చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమను అంగీకరించాలా వద్దా అన్నది మాత్రం ఆ యువతి పైన ఆదారపడి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ప్రేమను రిజెక్ట్ చేయడం ఎంతో మంది అమ్మాయిల పాలిట మృత్యు శకటం గా మారిపోతుంది అని చెప్పాలి. అప్పటివరకు నువ్వంటే ప్రాణం అంటూ తిరిగిన వాళ్లే ఇక ప్రేమను రిజెక్ట్ చేసినందుకు ఉన్మాదులు గా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.

 తన ప్రేమను అంగీకరించలేదు అనే కారణంతో యువతిని  దారుణంగా గొంతు కోసి చంపాడు ఇక్కడ ఒక ప్రేమోన్మాది. మహారాష్ట్రలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఔరంగాబాద్ లోని నాసిక్లో ఇక నిందితుడిని పట్టుకున్న పోలీసులు కటకటాల వెనక్కి తోసారూ. చరణ్ సింగ్  అనే 20 ఏళ్ల యువకుడు సుఖ్ ప్రీత్ కౌర్ అనే 18 ఏళ్ల యువతిని ప్రేమించాడు. అయితే ఇటీవలే తన ప్రేమను సదరు యువతికి చెప్పగా నాకు ఇలాంటివి నచ్చవు అంటూ చెప్పింది.  దీంతో సదరు యువతి చదువుతున్నా కళాశాల వద్దకు వెళ్లిన  యువకుడు దారుణంగా హత్య చేశాడు.

 యువతి గొంతు కోయడానికి ముందు నన్ను ఎందుకు ప్రేమించవు అంటూ గట్టిగా అరిచి నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా యువతి గొంతు కోశాడు.యువతి ప్రాణాలు వదిలింది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై అటు ఔరంగాబాద్లోని వేద నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం గమనార్హం. కాగా స్థానికులు ఇచ్చిన కీలక సమాచారం మేరకు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నాసిక్ లో ఉన్న సోదరి ఇంట్లో అతని గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటన కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: