పెళ్లి రోజు నాడు.. పాలకూర ప్రాణం తీసింది?

praveen
తన పెళ్లి రోజును ఎంతో ఆనందంగా భర్త తో కలిసి జరుపుకోవాలి అనుకుంది ఆ భార్య. కానీ పెళ్లి రోజు నాడే అనుకోని విధం గా విషాదం నుండి పోతుంది అని మాత్రం ఊహించలేక పోయింది. పెళ్లి రోజు ఎంతో ఘనం గా జరుపుకోవాలని ఆశలు పెట్టుకున్న సదరు మహిళకు ఆ రోజె నిండు నూరేళ్ళు నిండి పోయాయి. ఊహించని ఘటన చివరికి ఆమెను మృత్యు ఒడిలోకి చేర్చింది. దీంతో కుటుంబం లో ఒక్క సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్గొండ లోని తిరుమలగిరి మండలం తొండ గ్రామం లో ఈ విషాదకర ఘటన వెలుగు లోకి వచ్చింది.

 తాటిపాముల గ్రామానికి చెందిన రేణుక అనే 28 ఏళ్ల మహిళ తొండా గ్రామానికి చెందిన శేఖర్ తో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే ఇటీవల తమ పెళ్లి రోజు కావడంతో దైవ దర్శనానికి వెళ్లి వద్దాం అని అనుకున్నారు భార్యాభర్తలు. ఈ క్రమం లోనే కుటుంబసభ్యులంతా కలిసి యాదగిరిగుట్ట వెళ్లి నరసింహ స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో త్వరగా వంట పని పూర్తి చేసుకోవాలని అనుకుంది రేణుక. ఈ క్రమంలోనే ఇంటి ఎదురుగా ఉన్న కూరగాయల దుకాణం కు వెళ్లేందుకు రోడ్డు దాటి అక్కడ పాలకూర  కొనుగోలు చేసి తిరిగి ఇంట్లోకి వస్తున్న క్రమంలో వేగంగా వచ్చిన సెప్టిక్ ట్యాంక్ రేణుకను ఢీకొట్టింది.  దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది.

 ఇక పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: